మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి లో జరిగిన విషాద ఘటన అందరినీ కలచివేస్తోంది. ఓ ప్రాణాన్ని కాపాడాలనుకున్న చిన్నారులు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. నీటిలో పడిన మహిళలు కాపాడేందుకు వెళ్లిన చిన్నారులు... తమ కోసం ఎదురు చూస్తున్న మృత్యువుని ఊహించలేకపోయారు. దీంతో ఒక ప్రాణాన్ని కాపాడబోయి  తమ ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా ఎంతో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి లో విషాద ఘటన చోటుచేసుకుంది. నీటిలో పడిపోయినా మహిళను కాపాడేందుకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు... దుర్మరణం చెందారు.

 

 

 మల్కారం అరుంధతి నగర్ లో బీహార్ కు  చెందిన సర్జుల్ యాదవ్ దంపతులు ఎనిమిది మంది పిల్లలతో నివాసం ఉంటున్నారు. అయితే బుధవారం రోజున సర్జుల్  యాదవ్ కుమార్తె పుథుల్ (10) కొడుకు రాహుల్(9) ఇద్దరూ కలిసి అదే ప్రాంతంలో నివసించే హేమంత్ (12) అనే మరో బాలుడితో... సమీపంలోని ఓ క్వారీ గుంతలు స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే చిన్నారి పుథుల్  కాలు జారీ  గుంతలో నీటిలోకి పడిపోయింది. అదే సమయంలో అక్కడ బట్టలు ఉతుకుతున్న  25 ఏళ్ళ స్వప్న అనే మహిళ... నీటిలో పడి మునిగిపోతున్న చిన్నారి బాలిక ను బయటకు లాగింది. ఇంతలోనే ప్రమాదవశాత్తు స్వప్న కూడా కాలుజారి నీటిలో పడి పోయింది.

 

 

 దీంతో అక్కడే ఉన్న చిన్నారులు రాహుల్హేమంత్ మహిళ నీటిలోకి పడిపోవడంతో కాస్త భయాందోళనకు గురయ్యారు. ఇక క్వారీ గుంత లోతు కూడా ఎక్కువగా ఉండడంతో... ఆ మహిళ ఈత రాక మునిగి పోతుంది. ఇంతలోనే సదరు మహిళను కాపాడేందుకు అక్కడే ఉన్న రాహుల్ హేమంత్ లు  ప్రయత్నించారు. ఇక సదరు మహిళను బయటికి లాగుతూ ఆ చిన్నారిలు  ఇద్దరు నీటిలోకి పడిపోయారు. ఇక ఆ చిన్నారులకు ఈత రాకపోవడంతో క్షణాల్లో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ చిన్నారుల సాయంతో బయటపడిన మహిళ... అక్కడే ఉన్న చిన్నారి పుథుల్  గట్టిగా కేకలు వేయడంతో... అటువైపు నుంచి వెళ్తున్న అనే ఓ  వ్యక్తి హుటాహుటిన స్పందించి ఇద్దరు చిన్నారులను బయటకు తీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పటికే చిన్నారులు చనిపోయినట్లు గుర్తించారు. ఇక వెంటనే అక్కడికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ కొడుకులు చనిపోవడం చూసి బోరున విలపించారు. ఇక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: