దేశంలో అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లాక్ డౌన్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన జగన్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసారు. జనాలు ఎవరూ కూడా ఒక చోట ఉండవద్దని, ఉద్యోగస్తులు అయినా పబ్లిక్ రవాణా అయినా ఏది అయినా సరే ఒక చోట ఉండవద్దు అని అందుకే సినిమా హాల్స్, విద్యాలయాలు, షాపింగ్ మాల్స్ అన్ని కూడా మూసి వేస్తున్నామని జగన్ ప్రకటించారు. ప్రజలు అందరూ ప్రభుత్వాలకు సహకరించాలని జగన్ ఈ సందర్భంగా కోరారు. విదేశాల నుంచి వచ్చే వారు సహకరించాలని అన్నారు. 

 

ఇక నిత్యావసర సరుకులను అధిక ధరలకు అమితే మాత్రం కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎవరిని కూడా ఉపేక్షించేది లేదని అవసరమైతే సెక్షన్లు వాడి జైలుకి పంపిస్తామని స్పష్టం చేసారు. ప్రజల అవసరం తో వ్యాపారం చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదని జగన్ ఈ సందర్భంగా స్పష్టమైన హెచ్చరికలు చేసారు. ప్రభుత్వ ఉద్యోగులు షిఫ్ట్ ల వారీగా ఉద్యోగాలు చేసుకోవచ్చని, ఎవరూ ఎక్కువగా ఒక చోట ఉండటం మంచిది కాదని, కాని తనకు మాత్రం తప్పడం లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి బడ్జెట్ ప్రవేశ పెట్టాలి కాబట్టి అసెంబ్లీ కి వెళ్ళాలి అన్నారు. 

 

అసెంబ్లీ సమావేశాలను కూడా త్వరగా పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పారు. బడ్జెట్ అనేది చాలా కీలకమని అందుకే తప్పడం లేదని అన్నారు. ప్రతి కుటుంబానికి ఒక 1000 రూపాయలు కేజీ కంది పప్పు, రేషన్ బియ్యం ఫ్రీ గా ఇస్తామని చెప్పారు. ఏప్రిల్ నాలుగున వాలంటీర్లు వచ్చి అందిస్తారని చెప్పారు జగన్. అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో 100  ఐసోలేటెడ్ పడకలు ఏర్పాటు చేసామని అన్నారు. ప్రజలు అందరూ సహకరిస్తే కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో తరిమి వేయవచ్చు అన్నారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి: