కరోనా ఎంత వేగంగా వ్యాపిస్తుంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు. పార్కులు, మాల్స్ తో పాటు వేడుకలను కూడా వాయిదా వేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు ఉపయోగించాలని సూచించారు.

 

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ వస్తువుకు అయినా డిమాండ్ పెరిగినప్పుడే ఆ కంపెనీ యజమాని తెలివితేటలను ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలోనే డబ్బును పోగు చేస్తారు. డిమాండ్ ఉన్న వస్తువుపై కొంచెం ధర తగ్గించి అమ్మితే ఆ వస్తువుకు గిట్టుబాటు ఎక్కువ అవుతుంది. దానికి ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుంది. అలాంటి లాజిక్ నే ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఉపయోగించాయి. 

 

కరోనా ప్రభావం వలన శానిటైజర్ల ధరల్ని భారీగా తగ్గించారు. హ్యాండ్ శానిటైజర్ల ధరలకు ఎంఆర్‌పీని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఒక్క శానిటైజర్ బాటిల్ ధర రూ.100 మాత్రమే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో శానిటైజర్ల ధరల్ని భారీగా తగ్గిస్తున్నాయి ఎఫ్ఎంసీజీ కంపెనీలు. 

 

ప్రస్తుతం శానిటైజర్ల ఎక్కువగా వాడుకలోకి వచ్చాయి. అందులో లైఫ్‌బాయ్ శానిటైజర్, లైఫ్బాయ్ హ్యాండ్ వాష్, డొమెక్స్ ఫ్లోర్ క్లీనర్ల ధరల్ని15 శాతం తగ్గించాయి. తగ్గింపు ధరలతో ఈ ప్రొడక్ట్స్ కొద్దీ రోజుల్లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ వారు ప్రకటించారు.

 

55 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ బాటిల్ ధరను ఏకంగా రూ.77 నుంచి రూ.27 చేసింది ఐటీసీ. తగ్గింపు ధరలతో సావ్లాన్ శానిటైజర్లను తయారు చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. గోద్రెజ్ ప్రొటెక్ట్ శానిటైజర్ 50 ఎంఎల్ బాటిల్ ధరను రూ.75 నుంచి రూ.25 చేసింది. డాబర్ 500 ఎంఎల్ ప్యాక్‌ను రూ.250 ధరకు, 200 ఎంఎల్ ప్యాక్‌ను రూ.100 ధరకు అమ్ముతోంది. 

 

మార్చి నెల మొదటి వారంలో కంపెనీలు శానిటైజర్ల ధరలు భారీగా పెంచేసింది. అయితే ధర బాగా పెరుగుతుండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: