కరోనా వైరస్ ఎంత గోరంగా వ్యాపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే 4 లక్షల మంది ప్రజలు ఈ కరోనా బారిన పడగా లక్షమంది ప్రజలు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. అంతేకాదు ఈ కరోనా వైరస్ నుండి తప్పించుకోవాలి ఏకంగా 19వేలమంది మృతి చెందారు. 

 

IHG

 

అలాంటి ఈ కరోనా వైరస్ మన భారత్ లోకి ప్రవేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎవరు బయటకు రాకూడదు అని సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఎవరు బయటకు రాకూడదు అని వస్తే జైలు పాలవుతారు అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఈ కరోనా అత్యంత వేగంగా వ్యాపిస్తుంది అని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 

 

IHG

 

ఇకపోతే ఈ కరోనా వైరస్ కారణంగా మన దేశంలో ఎక్కువమంది ఎవరు ఉండకూడదు అని అనడంతో దేశమంతా రూల్స్ పాటిస్తుంది. ఎక్కడ అంటే అక్కడ ప్రజలు ఉండకూడదు అని.. నిత్యావసర వస్తువులు.. కూరగాయలు వంటి వాటి కోసం ప్రజలు వస్తూనే ఉన్నారు. ఇంకా ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ ఒకరిపై ఒకరు పడకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

 

IHG

 

ప్రతి కూరగాయల మార్కెట్ ముందు.. జనరల్ స్టోర్స్ ముందు.. మెడికల్ స్టోర్స్ ముందు అన్నిటి ముందు దూరం దూరం రౌండ్స్ వేపించి అందులో నిలబడి ఒకరు తర్వాత ఒకరు నడిచేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: