భార్యా భ‌ర్త‌ల మ‌ధ్య చిన్న చిన్న గొడ‌వ‌లు అనేవి చాలా స‌హ‌జం.   సంసారం సాఫీగా సాగిపోవాలంటే ఇల్లాలు ఎంతో ఓర్పుతో, నేర్పుతో కుటుంబంతో సహకరించాలి అని పెద్ద‌లు చెపుతుండేవారు. ఒక‌ప్పుడు ఉమ్మ‌డి కుటుంబాలు ఉండేవి భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు పెద్ద‌గా తావు ఉండేది కాదు. కొన్ని ఇళ్లలో ఉమ్మడి కుటుంబాలుంటాయి. మరికొన్ని ఇళ్లలో ఇద్దరే ఇద్దరుంటారు. భార్యాభర్తల బంధం అపురూపమైనటువంటి బంధం. అనుబంధంతో కూడిన సంసారం కుటుంబంలో అందరూ ఒకరినొకరు  అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. అదే ఇద్ద‌రే ఉంటే చిన్న చిన్న మ‌న‌స్ప‌ర్ధ‌లు కూడా ఒక్కోసారి పెద్ద గొడ‌వ‌లుగా అయిపోతాయి.

 

అంతేగాని కొన్ని సంసారాలలో మనస్పర్థలు, కీచులాటలు, గొడవలు చీటికిమాటికి పోట్లాటలు ఇలాంటివి బజారుకెక్కే ప్రమాదముంది తప్ప రాణించలేవు. ఆనందమైన సంసారం అనుబంధానికి మరో పేరుగా నిలుస్తుంది అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. భర్త మాట భార్య, భార్య మాట భర్త ఇద్ద‌రూ కూడా ఇగో ఫీలింగ్స్‌కి వెళ్ళ‌కుండా ఒక‌రి అభిప్రాయాల్ని మ‌రొక‌రు గౌర‌వించుకోవాలి.. సంసారంలో నేనేరాజు నేనే మంత్రి అన్న కాలం పోయింది. ఇరువురి అభిప్రాయాలు ఒకటి కావాలి. అప్పుడు సంసారం సౌభాగ్యంగా విలసిల్లగలదు.

 

భార్యాభర్తలు తమ సంసారం సాఫీగా నడపడంలో చక్కని సారథ్యం వహించాలి. తమ జీవితంలో ఎలాంటి చికాకులు రాకుండా చూసుకోవాలి. పిల్లలున్న ఇల్లు సందడిగా వుంటాయి. మరికొన్ని గందరగోళంలా వుంటాయి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, సంసారం, ఒక కుటుంబానికి వారధి కాగలవు. దానిని ఓర్పుగా నేర్పుగా ఇంటిఇల్లాలే అన్నీ స‌ర్దుకుంటూ చేసుకోవాలి. కొన్ని టీవీ సీరియల్స్‌లో చూసిన రీతిలో, భార్యాభర్తలు ఏదో ఒక చిన్న విషయానికి గొడవలు పడడం, చీటికి మాటికి చికాకుగా వుండడం అనుమానాలు తావివ్వడం వంటివి చక్కని సంసారానికి అవరోధం కలిగిస్తాయి.
ఈ విషయాన్ని భార్యాభర్తలిరువురూ గ్రహించాలి. చిన్నచిన్నగొడవలను వెంటనే ప్రక్కన తీసిపెట్టాలి. భవిష్యత్ కార్యాచరణ గురించి నిత్యం ఆలోచించాలి. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు చక్కగా తీర్చిదిద్దబడితే ఆ సంసారం శుభోదయం కాగలదు. చక్కని సంసారానికి చల్లని మనసుండాలి. చిరునవ్వుల హృదయం వుండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: