విశాఖ వాసులను కరోనా భయం వణికిస్తోంది. ప్రత్యేకించి ఈ సాగర నగరంలో వరసగా నాలుగు పాజిటివ్ కేసులు నమోద కావడం నగరవాసుల్లో కలవరం రేపుతోంది. అందులోనూ ఈ కొత్త కేసు కాంట్రాక్ట్ కేసు కావడంతో జనం భయపడుతున్నారు. ఇప్పటికే కరోనా వచ్చిన వ్యక్తి బంధువే నాల్గో పాజిటివ్ కేసు కావడం అధికారులను  సైతం కలవరపెడుతోంది. 

 

 

ఈ కాంట్రాక్ట్ కేసులను అరికట్టేందుకు విదేశాల నుంచి వచ్చిన వారినిపై జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టింది.  ఇప్పటి వరకు 100కు పైగా అనుమానితులకు పరీక్షలు చేశారు. నలుగురికి  పాజిటివ్ వచ్చింది. మరో 100 మందికి నెగిటివ్ వచ్చింది. ఇంకా 12 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. అందుకే ఇక విమ్స్ ను కోవిడ్ -19ఆస్పత్రిగా మార్చి తూర్పుగోదావరితో పాటు  ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చిన పాజిటివ్‌  కేసులకు చికిత్స అందించాలని నిర్ణయించారు. 

 

 

అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం.. విశాఖకు 2 వేల 795 మంది విదేశాల నుంచి వచ్చారు. జీవీఎంసీ పరిధిలో 2 వేల 224 మంది ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 571 మంది ఉన్నారు.  సీతమ్మ ధార, అల్లిపురం, గాజువాక, అనకాపల్లి గ్రామీణ పరిధిలో ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా వున్నారు. దాదాపు 100 బృందాలు అనుమానితులను పరీక్షలకు తరలించే పని చేస్తున్నాయి. 

 

 

 

విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టామని చెబుతున్నారు. జిల్లా కమిటీ వివిధ చర్యలు తీసుకుంటోంది.  పెద్ద వాల్తేరులోని ఛాతి ఆసుపత్రి , గీతం వైద్య కళాశాల ఆసుపత్రులు  జిల్లా కోవిడ్ అసుపత్రిగా సేవలు అందిస్తున్నాయి .ఇప్పటికే  3 వేల 500 క్వారంటైన్ పడకల సిద్ధం చేశారు. సీతమ్మధార, గాజువాక, గోపాలపట్నం, అనకాపల్లిని హైరిస్క్ ప్రాంతాలుగా ప్రకటించారు. వందల మంది విదేశీ రిటర్నిస్టులు ఉండటం వల్ల జనంలో భయాందోళనలు పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: