ఆంధ్రప్రదేశ్ పోర్టు నగరంగా విరాజిల్లుతున్న విశాఖపట్నంలో రోజు రోజుకి కరోనా అనుమానితులు పెరిగిపోతున్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే... నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలిన సంగతి అందరికి తెలిసినదే. అయితే కొద్ది సేపటి క్రితమే.. మరో కరోనా కేసు నేపథ్యంలో సమీపంలో వున్న స్థానికులు తీవ్ర కలవరానికి లోనయ్యారు. సదరు వ్యక్తి.. జలుబుతో మూలుగుతూ... ఈమధ్య విశాఖలోని కేజీహెచ్ ఆస్పత్రిలో చేరగా... మార్చి 27న అతని నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేశారు. 

 

వాటిని పరీక్షించిన కొద్ది క్షణాల పిదప.. అతగాడికి కరోనా వైరస్ లేదని తేట తెల్లం అయింది. దాంతో డాక్టర్స్ కరోనా నెగటివ్ అని ఓ అధికారిక రిపోర్ట్ విడుదల చేశారు. దాంతో అతని ఇండ్ల సమీపంలోగల స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. సదరు బాధితుని వయస్సు 65 ఏళ్ల కాగా... అతన్ని ఇటీవలే డిశ్చార్జ్ చేసారు.

 

ప్రస్తుతం.. ఏపీలో కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం కోరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 14కి చేరగా... ఆ లిస్టులో ఓ వ్యక్తి కరోనా వైరస్ బారినుండి పూర్తిగా బయటపడినందువలన అతన్ని డిశ్చార్జి చేయగా.. 13 కి లిస్టు కుదించబడింది. ఇది చాలా మంచి శుభ పరిణామమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే, ఇంకా మంచి ఫలితాలుంటాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

ఈ టోటల్ 14 కేసుల్లో 11 విదేశాల నుంచి వచ్చినవి కాగా... 3 మాత్రం లోకల్ గా నివసిస్తున్నవారే అని వివరించారు. ఇక కరోనా కట్టడి కోసం జగన్ సర్కార్.. తనవంతు కసరత్తులు చేస్తోంది. ఆ దిశగానే నిన్న  ఐదుగురు మంత్రులతో కూడుకొనివున్న ఓ కమిటీని వేసింది. వీరంతా... అను నిత్యం.. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యి, పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనావేసి, తదనుగుణంగా చర్యలు చేపడతారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: