తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ప్రత్యేకించి తెలంగాణలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో 60 దాటి పోయింది. అంతే కాకుండా కాంటాక్ట్ కేసుల కారణంగా ఈ సంఖ్య వేగంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. తాజాగా కుత్బుల్లాపూర్‌లో ఓ కుటుంబానికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. తెలంగాణలో మొదట్లో ఒకే సారి పది కేసులు నమోదు కావడానికి ఇండోనేషియన్లు కారణమన్న వాదన వినిపించింది. వీరంతా ఓ మత కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి రైళ్లో తెలంగాణకు వచ్చారు.

 

 

అంతే కాకుండా ఇటీవల ఏపీలో నమోదైన పాజిటివ్ కేసులకు సంబంధించిన వ్యక్తులు కూడా డిల్లీలోని ఓ మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో పాటు తాజాగా కుత్బుల్లాపూర్ కుటుంబానికి చెందిన వ్యక్తి కూడా ఢిల్లీలో మత సంబంధమైన కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెబుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఢిల్లీ జరిగిన ఓ మత సంబంధమైన కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులకూ కారణంగా మారింది. అసలు ఆ ఢిల్లీలో జరిగిన మత సంబంధమై కార్యక్రమం ఏంటి..?

 

 

ఎందుకు ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ కరోనా వచ్చింది. ఇందుకు ఇండోనేషియన్లు కారణమా.. లేక ఢిల్లీలోని మత పెద్దల నిర్లక్ష్యం కారణమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికారులు కూడా ఈ అంశంపై దృష్టి సారించి కాస్త లోతుల్లోకి వెళితే ఈ కరోనా కేసులకు మూలం ఏమైనా దొరకొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి.

 

 

ఈ మత సంబంధమైన కార్యక్రమానికి ఇంకెవరైనా వెళ్లారా.. వెళ్లి కూడా కరోనా లక్షణాలు బయటపడకుండా ఉన్నారా.. అలాంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి ద్వారా మిగిలిన వారికి కరోనా వ్యాపించకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: