తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 70 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని చెప్పారు. వారిలో ఈరోజు 11 మందికి పరీక్షలు చేయగా నెగిటివ్ వచ్చిందని అన్నారు. ఈ 11 మంది సోమవారం రోజున డిశ్చార్జ్ అవుతారని... రాష్ట్రంలో 58 మంది బాధితులు మాత్రమే మిగులుతారని అన్నారు. 5,472 బృందాలు క్వారంటైన్ లో ఉన్నవారిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. 
 
25,937 మంది పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. ఇప్పటికే వచ్చిన వారు ఎవరికైనా అంటిస్తే తప్ప కొత్తగా దేశంలో కరోనా సోకదని అన్నారు. కరోనాను కట్టడి చేయడానికి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం లాక్ డౌన్ మాత్రమే అని అన్నారు. రాష్ట్రంలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నావారిలో కరోనా లక్షణాలు లేవని చెప్పారు. ఏప్రిల్ 7 తర్వాత రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకపోవచ్చని ప్రకటన చేశారు. 
 
మన దేశంలో అవసరానికి తగినంత మెడికల్ ఎక్విప్ మెంట్ లేదని అన్నారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేస్తామని... లాక్ డౌన్ ప్రజలు సహకరించాలని కోరారు. ఏప్రిల్ 1 నుంచి 10 వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: