కరోనా వైరస్ మీద భారత్ మొత్తం యుధ్ధం ప్రకటించింది. ఈ  యుధ్ధానికి కత్తులు, కటార్లు అవసరం లేదు. ఏకంగా తలుపులు బిడాయించి ఇంట్లో కూర్చోవడమే. అయితే ఇదేమంత తేలిక కాదు, దానికి ఎంతో ఓపిక, సహనం ఉండాలి. భారతీయుల సహజ స్వభావానికి పూర్తి విరుధ్ధమైన అరుదైన  ప్రయోగం ఇది.

 

మరి ఇది దేశంలో ఎంతవరకూ విజయవంతం అయిందన్నది చూడాలంటే మార్చి నెల మొత్తం ఒక్కసారి వెనక్కి తిరిగి  నెమరువేసుకోవాలి. కరోనా వైరస్ భారత్ లో ఎంటరైంది మార్చి నెలలోనే. మార్చి 2వ తేదీకి కేవలం రెండు కేసులు మాత్రమే బయటపడ్డాయి. అంటే చాలా చిన్న నంబర్ తో కరోనా తన నడక మొదలుపెట్టింది.

 

ఇక మార్చి 31వ తేదీకి వచ్చేసరికి ఆ సంఖ్య 1400 పై దాటేస్తోంది. అంటే కేవలం నెల రోజుల వ్యవధిలోనే కరోనా నంబర్ ఒక్క అంకె నుంచి నాలుగు అంకెలకు ఎగబాకింది. ఇక కేంద్రం మార్చి రెండవ వారం తరువాత కరోనా పైన సీరియస్ గా ద్రుష్టి పెట్టింది. ఇక మార్చి మూడవ వారం వచ్చేసరికి అన్ని రాష్ట్రాలు యుధ్ధానికి దిగిపోయాయి.

 

గత పది రోజులుగా దేశం తలుపేసుకుంది. ఇంటిపట్టునే ఉంది. ఇక లాక్ డౌన్ ప్రకటిచిన నాటికి చూసుకుంటే రెండు వంద లోపు మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మరి కేవలం పది రోజులో ఆ సంఖ్య కాస్తా ఏడు రెట్లకు పెరిగిపోయిందటే అది కరోనా దూకుడుకు నిదర్శనమే అంటున్నారు.

 

ఇక కరోనా వ్యాప్తిని  అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. అయినా సరే కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదు అవుతున్నాయి. అంటే ఇవి పాత కేసులా లేక వ్యాప్తి చెందిన కేసులా అన్నది చూడాలి. అయితే వ్యాప్తి  చెందితే పరిస్థితి ఇంతకంటే భయంకరంగా ఉంటుందని అంటున్నారు.

 

అందువల్ల లాక్ డౌన్ వల్ల కరోనా వ్యాప్తి బాగానే కట్టడి జరిగిందని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఏప్రిల్ 14న అంటే లాక్ డౌన్ కి చివరి రోజు అన్న మాట. నాటికి చూసుకుంటే విదేశాల నుంచి వచ్చిన వారి కేసులు మొత్తం ఒక కొలిక్కి వస్తాయి. అంటే ఆ కేసులు పూర్తిగా బయటపడిపోతాయి.

 

అపుడు కూడా కొత్త కేసులు వెల్లువలా వస్తే మాత్రం దేశం ప్రమాదంలో ఉన్నట్లే. మూడవ దశలోకి కరోనా మహమ్మారి వెళ్ళిపోయినట్లే. అదే జరిగితే కరోనా నంబర్లు కూడా అయిదారు అంకెలు దాటే ముప్పు పొంచి ఉంటుందని అంటున్నారు. అంతదాకా తెచ్చుకోకుండా ఉండాలంటే లాక్ డౌన్ ని అంతా కచ్చితంగా పాటించాలి.

 

ఇక విదేశాలకు వెళ్ళినా, ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు అయినా తమ వివరాలు అధికారులు స్వయంగా చెప్పి స్వచ్చంద క్వారంటైన్ కి సిధ్ధపడాలి. ప్రతీ ఒక్కరూ చైతన్యంతో ఉంటేనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యపడుతుంది.
 

 

మరింత సమాచారం తెలుసుకోండి: