ఈ ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మనిషిలోనూ తనదైన ఓ ప్రత్యేకత ఉంటుంది. తనదైన క్రియేటివిటీ ఉంటుంది. దురదృష్టం ఏంటంటే.. చాలా మంది అసలు దాన్ని గుర్తించరు. వారిపై వారికే ఉండే ఓ చిన్నచూపు అందుకు కారణమా.. మనమా.. అబ్బే మన వల్ల ఏమవుతుంది.

 

 

అబ్బో అలాంటి పనలు చేయాలంటే మహానుభావులు కావాలి.. గొప్ప టాలెంట్ కావాలి.. మనకంత సీన్ లేదు.. ఇలా సాగిపోతాయి చాలా మంది ఆలోచనలు. అక్కడే మొదటి తప్పు జరిగిపోతుంది. మీరూ ఈ ప్రపంచంలోని ఓ ప్రత్యేక మైన వ్యక్తి అని ఎప్పుడు మీరు నమ్ముతారో అప్పుడే మీ విజయానికి పునాది పడిపోయినట్టే.

 

 

మీ విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. కాకపోతే మీరు దాన్ని గుర్తించలేదంతే. ఇందుకు ఓ ఉదాహరణ చెప్పొచ్చు. వివేకానందనందుడు ప్రపంచ సర్వమత సభల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లినప్పుడు ఆయనకు ఏమాత్రం సానుకూల పరిస్థితులు లేవు. ఎర్రతివాచీ పరచి ఏమీ ఆయనను స్వాగతించలేదు.

 

 

పరాభవాలను, ప్రతికూలతలనూ తట్టుకొని ఆయన ఆత్మవిశ్వాసంతో, పరమాత్మపై విశ్వాసంతో ముందుకు వివేకానంద సాగిపోయారు. ఆధ్యాత్మిక ఝంఝామారుతంలా తన ప్రసంగాలతో పాశ్చాత్యులను ప్రకంపింపజేశారు. మనలోని ఆత్మవిశ్వాసాన్ని, ఆశావహ దృక్పథాన్ని, ప్రేమస్వభావాన్ని కాలం ఎన్నటికీ లాగేసుకోలేదు. ఇది మీరు నమ్మితే మీ విజయం అప్పుడే మొదలైనట్టే..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: