ఆసియాలోని వియత్నాం దేశంలో కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటి వరకు కేవలం 257 మాత్రమే నమోదు కాగా... కరోనా కారణంగా ఎవరూ మరణించలేదు. ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమౌతున్న వేళ... వియత్నాం మాత్రం ముందస్తుగానే తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రస్తుతం ప్రశాంతంగా తమ జీవనాన్ని కొనసాగిస్తుంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ... భౌతిక దూరాన్ని అక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ దేశం కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదవారికి అండగా నిలబడేందుకు విన్నూత ప్రయత్నాలు చేస్తోంది.


తాజాగా ఉచిత రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేసి పేదలకు మూడు కిలోల రైస్ అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. PHGLock అనే ఓ ప్రముఖ సంస్థ రైస్ ఏటీఎంలను కనిపెట్ట గా... లబ్ధిదారులు బియ్యం పొందేందుకు యాక్టివ్ బటన్ నొక్కితే సరిపోతుంది. అయితే బియ్యం సేకరిస్తున్న ప్రజలు భౌతిక దూరాన్ని పాటించే విధంగా అక్కడ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే చాలామంది అత్యాశ కలిగిన ధనవంతులు పేద వారి కొరకు అందిస్తున్న బియ్యాన్ని కూడా దక్కించుకునేందుకు బారులు తీరారు. కానీ ధనవంతులను ఉచిత బియ్యం పొందేందుకు అధికారులు అనుమతించడం లేదు. ఇలా చేస్తేనే ప్రతి పేదవాడికి బియ్యం అందుతుందని అక్కడి అధికారులు తెలుపుతున్నారు. బియ్యం సేకరించిన ప్రతి వ్యక్తి మరోమారు తీసుకోకుండా తమ పేరు రాయాల్సి ఉంటుంది.


మన దేశంలో కూడా కేవలం పేదవాడికి మాత్రమే రేషన్ బియ్యం లభించేటట్లు ఉన్నట్లయితే బాగుండేదని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రైస్ ఏటీఎం ఫోటోలు ప్రస్తుతం నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణ కొరకై వియత్నాం లో కూడా ప్రజారవాణా నిలిచిపోగా... విదేశీ విమానాల రాకపోకల ఏప్రిల్ 15వ తేదీ వరకు నిలిపివేయబడినవి. ఎంతైనా ఒక్క కరోనా మరణం కూడా సంభవించకుండా తెలివైన చర్యలను చేపట్టిన వియత్నాం దేశానికి హ్యాట్సాఫ్ చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: