లోకంలో మానవత్వం పూర్తిగా నశించింది అనడానికి కొన్ని ఘటనలే ఉదాహరణగా చెప్పవచ్చూ.. ఎందుకంటే మంచిచేసే వారి పట్ల వినయం ప్రదర్శించక పోగా వారికే చెడు చేస్తున్నారు కొందరు మనుషులు అని చెప్పుకునే వెధవలు.. నిజానికి ఇలాంటి వారికి జీవితం విలువలు తెలియవని చెప్పవచ్చూ.. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తమ విధులను దైవసమానంగా భావించి నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది పైన.. పోలీసులపైనా దాడులకు ఎగబడుతున్నారు.. మనుషులు అని చెప్పుకునే మానవులు.. ప్రజలకు కరోనా సోకకుండా.. ప్రజా ఆరోగ్యమే తమ శ్రేయస్సుగా భావించి.. కుటుంబాలకు.. తాము కన్న బిడ్దలకు దూరంగా ఉండి సేవలు అందిస్తున్న వారి పట్ల ఇలా ప్రవర్తించమని ఏ పాఠం చెబుతుందో..

 

 

సంస్కార హీనులుగా మారుతున్న ఇలాంటి వారికి కరోనా కాదు అసలు ఎందుకు బ్రతికి ఉన్నామా అనేలా హింసపెట్టి చంపే రోగాలు రావాలి.. అసలే కరోనా వైరస్ కంటికి చిక్కకుండా నానా హింసపెడుతూ విస్తరిస్తుంటే అధికారుల మాటలను తేలిగ్గా తీసుకుంటు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్న వారిని ఏం చేసిన పాపం లేదు.. ఇకపోతే ప్రస్తుత పరిస్దితుల్లో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్యం అందిస్తుంటే.. కొందరు కరోనా రోగులు వైద్యులను భయాందోళనకు గురిచేస్తున్నారు.. ఇలా అన్ని చోట్ల జరుగుతున్న అక్కడక్కడ మాత్రమే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకునే ఘటన..

 

 

తమిళనాడులోని తిరుచురాపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో, కరోనా సోకిన ఓ వ్యక్తి తనకు వైద్యం అందిస్తున్న డాక్టర్‌పై వికృత చర్యలకు పాల్పడ్డాడు. తన మాస్క్‌ను మొహం మీదకు విసిరేసి.. ఆయనపై ఉమ్మేశాడు. రోగి తీరుతో షాక్ తిన్న డాక్టర్ భయంతో పరుగులు తీయగా, అక్కడి వైద్య సిబ్బంది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటన శనివారం రాత్రి జరిగినట్లు తెలుస్తోంది.. ఇదే కాకుండా అతడు ఆస్పత్రిలో చేరిన దగ్గర నుంచి డాక్టర్లకు సహకరించడం లేదట.. ఈ విషయాన్ని డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, వైద్యుడిపై ఉమ్మినందుకు ఆ రోగిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: