ప్రపంచాన్ని నంగనాచి దొంగలా దోచుకుంటున్న కరోనా వల్ల ప్రతి వారికి కష్టాలు ఎదురవుతున్నాయి.. ఇప్పటికే లాక్‌డౌన్ వల్ల పేదల డొక్కలు ఎండిపోతున్నాయి.. కూలీ పనులు లేక ఎందరో అభాగ్యులు తమ ప్రాణాలను పిడికిట్లో బిగించుకుని ఎవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు అనే ఆశతో ఎదురు చూస్తున్నారు.. ఇక మామూలు రోజుల్లో రక్తాన్నే చెమటగా మార్చి కష్టించి పని చేసినా కడుపునిండని వారి దుస్దితి ఈ సమయంలో మరీ దారుణం.. ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పేదలను ఆదుకోవడానికి వారికున్న విధివిధానాలను బట్టి ప్రణాళికలు సిద్దం చేస్తుండగా.. మన రెండు తెలుగురాష్ట్రాల్లో ఇప్పటికే ఏపీలో పేదలందరికి జగన్ రూ..1000 అకౌంట్లో జమచేసారు.. అలాగే ఇంటింటికి కూరగాయలతో పాటుగా నిత్యావసర సరకులు పంచుతున్నారు..

 

 

ఇలాంటి సమయంలో బతుకు విలువ, మెతుకు విలువ, పైస విలువ చాల మందికి తెలిసివచ్చినట్లుగా ఉంది.. ఇంత కాలం విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసిన వారు ఈ సమయంలో చాలా పొదుపుగా వాడుకుంటున్నారు.. మరి ఇప్పుడు మనకు వచ్చిన కష్టం కాలం మనింటికి చుట్టాన్ని తీసుకు రాలేదు.. చావును మోసుకు వచ్చింది.. అందుకే ఇప్పుడున్న పరిస్దితుల్లో బ్రతుకును బంగారం కంటే భద్రంగా కాపాడుకుంటేనే జీవించగలం.. కాదని అనుకుంటే కాటికి పోవడం ఖాయం.. ఇకపోతే తెలంగాణాలో ఇప్పటివరకు ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌ల‌స వ‌చ్చిన కూలీల‌కు మాత్రమే ఒక్కొక్క‌రికి 12కిలోల బియ్యంతో పాటు రూ.500ను ప్ర‌భుత్వం అందచేసింది.. కానీ ఈ రాష్ట్ర పేదలకు ప్రభుత్వం ప్రకటించిన సహాయంలో ఒక రేషన్ బియ్యం మాత్రమే అందాయి..

 

 

ఇదిలా ఉండగా ఇక్కడి పేద ప్రజలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సహాయం.. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 అందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఈ నేపధ్యంలో మంగళవారం ఈ డబ్బు అర్హుల అకౌంట్లలో జమకానున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే మంగళవారం అంబేద్కర్‌ జయంతి కావడంతో బ్యాంకులకు సెలవు.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్లకు ఏటీఎం కార్డులు ఉన్నవారు మెసేజ్‌ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు.. ఇకపోతే తెలంగాణ వ్యాప్తంగా 74లక్షలకు పైగా అకౌంట్లలో ఈ డబ్బు జమ అవుతుందని, ఇందుకు గాను మొత్తం రూ.1,112 కోట్లను ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసినట్లు మంత్రి తెలిపారు... ఇదిలా ఉండగా  రేషన్‌కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ అయి ఉండి, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ లేని వారికి రెండో విడతలో నగదు బదిలీ చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: