వైయస్సార్ సిపి పార్టీ లో జగన్ తర్వాత ఎక్కువగా వినబడే పేరు విజయసాయిరెడ్డి. పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఢిల్లీలో కేంద్రం దగ్గర మంచి పేరు సంపాదించి రాష్ట్ర అవసరాలను తీరుస్తూ కీలకంగా రాణిస్తున్నారు. పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధం ఉంది. వైయస్ ఉన్న నాటి నుండే విజయ సాయి రెడ్డి..వైఎస్ కుటుంబంలో కీలకంగా రాణించారు. వైయస్ చనిపోయిన తర్వాత వైయస్ జగన్ కి రాజకీయంగా అండగా అన్ని విధాల తోడుగా క్లిష్ట సమయంలో కూడా నిలబడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో పార్టీ ఇన్చార్జిగా ఉంటూ పార్టీ క్యాడర్ మొత్తం ఒక్క తాటిపై ఉండేలా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ పీరియడ్ లో మూడు జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వం ఒక్కటిగా నిలిచి జనం కంట్రోల్ లో ఉండే విధంగా తన మార్క్ వ్యూహాన్ని అమలు చేస్తూ రాణించారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే ఉత్తరాంధ్రలో...టిడిపి పునాదులు కదిలిపోయే విధంగా విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో టీడీపీ ఒక్కో వికెట్ ని పడగోడతున్నారు.

 

నిరంతరం పార్టీ నేతలకు అందుబాటులో ఉన్న విజయసాయిరెడ్డి...జగన్ వ్యూహాలకు అనుగుణంగా ఉత్తరాంధ్రలో పార్టీ కేడర్ ని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఉండే మూడు జిల్లాల రాజకీయాలను తన కనుసన్నల్లో ఉండేలా ఎక్కడికక్కడ మొత్తం గ్రిప్ సాధించారు. ఉత్తరాంధ్ర లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులంతా ప్రస్తుతం విజయసాయి రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నారు. పార్టీకి సంబంధించి ఎవరు కష్టపడుతున్నారు ఎవరు పార్టీకి అండగా నిలబడుతున్నారు వంటివారిని గుర్తిస్తూ వారికి రాజకీయంగా అండగా ఉంటున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో విజయసాయి రెడ్డి గురించి ఉత్తరాంధ్రలో మంచి బూస్టింగ్ న్యూస్ వినబడుతోంది. అదేమిటంటే విశాఖ పట్టణానికి రాజధాని చేరుకున్న తర్వాత… ఉత్తరాంధ్రలో బలమైన పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేయడానికి విజయసాయిరెడ్డి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఈ విధంగా చేయడం వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసలకు వెళ్లిపోయే విధానాన్ని కట్టడి చేయడానికి.. ఉత్తరాంధ్రలో ఉపాధి కల్పించే విధంగా విజయసాయిరెడ్డి ఆలోచన చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: