లోకంలో మృత్యువు రాకను పసిగట్టడం అనేది అసంభవం.. ఆ మృత్యువుకు మంచిచెడులు తెలియవు.. సమయం ఆసన్నమైందా.. ప్రాణాలను తీసుకువెళ్లుతుంది.. ఈ కరోనా కాలంలో జరుగుతుంది అదే.. ఈ సమయంలో వైద్యుల ప్రాణాలు వెలకట్టలేనివి.. వారు అందించే సేవలు దేశానికి ఎంతో అవసరం.. ఇన్నాళ్లుగా సైనికులు పోరాడారు.. ఇప్పుడు వైద్య సిబ్బంది పోరాడుతున్నారు.. వీరంత ప్రజల కోసమే తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే కరోనా రోగులకు వైద్యం చేస్తున్న డాక్టర్లు కూడా ఈ వైరస్ బారిన పడి మరణిస్తున్న విషయం తెలిసిందే.. అలుపెరుగని ఈ పోరాటంలో ఇలా ఎంతో మంది వైద్య సిబ్బంది తమ ప్రాణాలు అర్పించారు..

 

 

ఈ సమయంలో వీరి ప్రాణాలు చాలా విలువైనవి.. కానీ ఎలాంటి వైరస్ సోకకుండా ఒక వైద్యుడు ప్రాణాలు వదిలాడు.. అతన్ని వెంటాడిన మృత్యువు కనికరం లేకుండా ప్రాణాలు తీసింది.. విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.. తన కారు రిపేర్ అయిందని సైకిల్ పై విధులకు హజర్ అయ్యి తిరిగి ఇంటికి బయలుదేరగా అతని కోసమే మృత్యువు పోంచి ఉన్నట్లుగా ఆ వైద్యున్ని కబళించింది.. ఆ వివరాలు చూస్తే.. ఢిల్లీకి చెందిన డాక్టర్ జేపీ యాదవ్ సాకేత్ ప్రాంతంలో ఉన్న ఓ ఆస్పత్రిలో వైద్యునిగా సేవలు అందిస్తున్నారు.. ఈ క్రమంలో డ్యూటీకి వెళ్దామని బయలుదేరిన సమయంలో అతని కారు స్టార్ట్ అవకపోవడం వల్ల, అందులో లాక్‌డౌన్ అమల్లో ఉండడంతో మెకానిక్‌లు ఎవరు అందుబాటులో లేకపోవడం వల్ల రిపేర్ చేయించే పరిస్థితి లేకపోయింది.

 

 

ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సైకిల్‌పై ఆస్పత్రికి వెళ్లి విధులకు హాజరైన ఇంటికి తిరిగి వస్తూండగా, యాదవ్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సైకిల్‌పై వస్తున్న ఆయనను మాలవీయ నగర్ సిగ్నల్ వద్ద వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జేపీ యాదవ్ సైకిల్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. వెనకే కారులో వస్తున్న సహ వైద్యులు స్పందించి ఆయనను సాకేత్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన యాదవ్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.

 

 

ఇంత జరిగినా.. ప్రమాదానికి కారణమైన కారును ఆ డ్రైవర్ ఆపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం దురదృష్టకరం.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాలవీయ నగర్ సిగ్నల్ వద్దనున్న సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ప్రమాదానికి కారణమైన కారును పసిగట్టే ప్రయత్నాలు ప్రారంబించారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: