వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్ష రేస్ నుంచి తప్పుకుంటున్నట్టు సెనేటర్, డెమోక్రటిక్ అభ్యర్థి బెర్నీ శాండర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నారు. ట్రంప్ వ్యవహార శైలి గురించి అమెరికా ప్రజల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ట్రంప్ ఎల్లప్పుడూ అమెరికాకే ప్రథమ ప్రాధాన్యం అనేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ట్రంప్ ప్రపంచ నాయకుడి స్థాయి హుందాతనం కనబరచలేకపోయారని కూడా పలు సందర్భాల్లో ఆయనపై విమర్శలు వ్యక్తమయ్యాయి. 
 
ట్రంప్ కు ప్రత్యర్థిగా పోటీ చేయాల్సినప్పటికీ అనారోగ్యం వల్ల బెర్నీ శాండర్స్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ పేరు మనకు పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ బెర్నీ శాండర్స్ వ్యవహార శైలి గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. బెర్నీ శాండర్స్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్న వ్యక్తి. సోషలిస్ట్ గా చెప్పుకునే బెర్నీ శాండర్స్ ఐడియాలు మాత్రం భయంకరంగా ఉంటాయి. 
 
తన ఆలోచనల్లో ఆచరణ సాధ్యం కాని హామీలే ఎక్కువగా ఉంటాయి. ఇతని ఆలోచనలను అమలు చేస్తే అగ్ర రాజ్యం కాస్తా సామాన్య దేశంగా మారిపోతుందనడంలో ఎటువంటి సందేహంలేదు. బెర్నీ మానస పుత్రిక అలెగ్జాండ్రియా ఆలోచనలు కూడా భయంకరంగానే ఉంటాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ 25,000 ఉద్యోగాల కల్పనతో కొత్త హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ లో కట్టాలని నిర్ణయించుకోగా బెర్నీ, అలెగ్జాండ్రియా ఇద్దరూ తమ మద్ధతుదారులతో కలిసి నిరసనకు దిగారు. 
 
అమెజాన్ వల్ల కుటుంబాలు విడిపోతాయని నిరసనకు దిగడంతో అమెజాన్ 15,000 ఉద్యోగాలను కల్పిస్తూ హైదరాబాద్ లో హెడ్ క్వార్టర్స్ ను కట్టింది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి యుద్ధం చేస్తామంటూ బెర్నీ ప్రకటన చేశారు . పెద్దపెద్ద కంపెనీలపై పన్నులు పెంచాలని, శ్రీమంతులపై పది రెట్ల పన్ను పెంచాలని డిమాండ్ చేశారు. బెర్నీ అధికారంలోకి వస్తే వాణిజ్య బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను బ్రేక్ చేయాలని చెబుతాడు. అగ్ర రాజ్యం అధ్యక్ష రేస్ నుండి బెర్నీ తప్పుకోవడంతో అమెరికా బ్రతికిపోయిందని బెర్నీ గురించి తెలిసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: