జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాక్ డౌన్ ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్న పేదవారికి అండగా నిలవాలని తన పార్టీ నేతలను, కార్యకర్తలను కోరారు. దాంతో ప్రతి రోజూ వేలమంది జనసైనికులు ప్రతి పేదవాడి ఇంటికి తిరుగుతూ కాయగూరలను అందజేస్తున్నారు. వీరవాసరం మండలంలోని 22 వేల కుటుంబాలకు స్థానిక జనసైనికుల ఆర్థిక సాయంతో రూ.30 లక్షల ఖర్చు పెట్టి పలు రకాల కూరగాయలు పంపిణీ చేసి గుండా రామకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు.


కార్పొరేటర్ అభ్యర్థుల సహాయంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులను జన సైనికుడు పోతిన వెంకట మహేష్ అందజేశారు. తాడిశెట్టి నరేష్ పామర్రు నియోజకవర్గ పరిధిలోని నిరుపేదలకు నిత్యవసర సరుకులు భోజనంతో పాటు మాస్కులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. జన సైనికురాలు విశాలి కాట్నం తణుకు నియోజకవర్గంలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న పేదలకు అన్నదానం జనసేన నేత పరశురాం అన్నదానం చేశారు.


ఇలా ప్రతి చోటా జనసైనికులు ఎంతోమంది పేద వారికి నిత్యావసర సరుకులు అందజేస్తూ అందరి ప్రశంసలను అందుకున్నారు. పవన్ కళ్యాణ్ పేదలకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వారిలో కొండంత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి విపత్కర గడ్డు పరిస్థితులలో ఏ పేదవాడు ఆకలి తో నిద్రపోకూడదు అనే ఉద్దేశంతో జనసైనికులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవి. ఇతర పార్టీ నేతలు కూడా తమకు చేతనైనంత సాయం చేస్తూ పేదవారి ఆకలి ని తీరుస్తున్నారు. లాక్ డౌన్ పొడగించడానికి ముందుండే కొంతమంది రాజకీయ నేతలు ప్రజల ఆకలి తీర్చడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేరు. భారతదేశానికి బరువుగా ఉన్న వీరు ఉన్నత పదవిలో కొనసాగడం ఎంతో బాధాకరం. 

మరింత సమాచారం తెలుసుకోండి: