దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తుండ‌గా...లాక్‌డౌన్ తేది కూడా స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఈనెల 27న సీఎంలతో ప్ర‌ధాన‌మంత్రి మోదీ వీడియో కాన్ఫరెన్స్  నిర్వ‌హిస్తుండ‌టం ప్రాధాన్యం సంత‌రించుకుంది. చాలా రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ తీవ్ర‌రూప‌మే దాల్చుతోంది. ఇప్ప‌ట్లో త‌గ్గ‌ముఖం ప‌ట్టే ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. ద‌శ‌లవారీగా లాక్‌డౌన్ నుంచి స‌డ‌లింపు ఇవ్వాల‌ని భావించిన కేంద్ర‌ప్ర‌భుత్వ వ్యూహానికి క‌రోనా వైర‌స్ గండికొట్టింది. తాజాగా బుధ‌వారం దేశంలో కరోనా కేసులు 20వేలు దాటిపోవ‌డం 700ల‌కు చేరువ‌లో మ‌ర‌ణాల సంఖ్య ఉండ‌టం కేంద్ర‌ప్ర‌భుత్వం వెన్నులో వ‌ణుకుపుట్టిస్తోంది. మ‌రీ ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో క‌రోనా ఉగ్ర‌రూపం చూపుతోంది


కేంద్ర ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం, దేశవ్యాప్తంగా కరోనా కేసులు 20,471కు చేరుకున్నాయి. వీటిలో 15,859 యాక్టివ్ కేసులు కాగా, 3,958 మందికి పూర్తి స్వస్థత చేకూరి డిశ్చార్చి అయ్యాయి. 652 మరణాలు సంభవించాయి. ఈ ఒక్కరాష్ట్రంలోనే దేశం మొత్తం న‌మోదైన కేసుల్లో పావులా వంతు ఉండ‌టం గ‌మ‌నార్హం. మధ్యప్రదేశ్‌లో కరోనాతో బుధ‌వారం ఒక్క‌రోజే 35 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1587కి చేరగా.. 80 మంది మృతిచెందారు. జమ్మూకశ్మీర్‌లో  ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 407కి చేరింది. జమ్మూలో 56; కశ్మీర్‌లో 351 కేసులు న‌మోద‌య్యాయి.

 

క‌రోనా వైర‌స్ ఎంతో ఆక్టివ్‌గా మూవ్ అవుతున్న త‌రుణంలో మే3 త‌ర్వాత ఎలాంటి చ‌ర్య‌ల‌కు ప్ర‌ధానమంత్రి ఆదేశిస్తార‌నే దానిపై ముఖ్య‌మంత్రుల్లో సైతం ఉత్కంఠ‌నెల‌కొంది. సుదీర్ఘ‌కాల లాక్‌డౌన్ అమ‌లుతో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌తనావ‌స్థ‌కు చేరుకుంది. క‌రోనా మాత్రం ఇప్ప‌ట్లో త‌గ్గుముఖం ప‌ట్టే సూచ‌న‌లు క‌న‌బ‌డ‌టం లేదు. ఇలాంటి సంక‌ట స్థితిలో దేశం ప‌య‌నం..ఎలా ఉండ‌బోతోంద‌న్న దానిపై సామాన్యుల్లోనూ ఆస‌క్తి నెల‌కొంది. 27న ప్ర‌ధాన‌మంత్రి నిర్వ‌హించ‌బోయే వీడియో కాన్ఫ‌రెన్స్‌లో దాదాపు భ‌విష్య‌త్ నిర్ణ‌యాలు ఖ‌రార‌వుతాయ‌ని విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ పెంచే అవ‌కాశాలు మెండుగా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: