దేశం మొత్తం కరోనా  వైరస్ పై  యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో మొట్టమొదటి కరోనా  వైరస్ కేసు నమోదు అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తూనే ఉన్నారు. కంటికి కనిపించని శత్రువును దేశం నుంచి తరిమి కొట్టేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కంటికి కనిపించని శత్రువును తరిమి కొట్టేందుకు ప్రజలను ఇంటికే పరిమితం చేసి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న... దేశ ప్రజల ప్రాణాలను రక్షించడానికి ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ మహమ్మారి ఎఫెక్ట్ భారతదేశంలో కూడా బాగానే ఉంది. 

 

 

 ఇదిలా ఉంటే భారతదేశంలో లాక్ డౌన్  విధించక ముందు అతి  తక్కువగా ఉన్న కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు... లాక్‌డౌన్‌ తర్వాత ప్రజలను ఇంటికే పరిమితం చేసి... అన్ని రకాల రవాణా వ్యవస్థలు మూసివేసి... విదేశాల నుంచి ఎవరినీ అనుమతించకపోవడం లాంటి ఎన్నో కఠిన నిబంధనలు ఆంక్షలు అమలులోకి తెచ్చినప్పటికీ క్రమక్రమంగా భారతదేశంలో కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం పెరిగిపోతూనే ఉంది. ప్రజలందరూ ఇంటికే పరిమితమైన వేళ కరోనా వైరస్  మాత్రం విజృంభిస్తోనే  ఉంది. రోజురోజుకు కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏకంగా భారతదేశంలో లాక్ డౌన్ కి  ముందు అతి తక్కువగా ఉన్న కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 20 వేలు  దాటిపోయింది. 

 

 

 అయితే అగ్రరాజ్యాలతో అయితే పరిస్థితి మరింత ఘోరంగా ఉన్న విషయం తెలిసిందే. అక్కడ ఏకంగా లక్షా రెండు లక్షల కేసులు దాటిపోయినా పరిస్థితి ఉంది అక్కడ మరణాల రేటు కూడా బాగానే ఉంది. అయితే అగ్రరాజ్యాల కంటే ఎక్కువ జనాభా ఉన్నప్పటికీ తక్కువ వైద్యసదుపాయాలు ఉన్నప్పటికీ అగ్రరాజ్యాల లో లాగా భారత్ లో లక్ష వరకు కరోనా  కేసులు పెరగకుండా కట్టడి చేసాము అని సంతోషపడాలా.. లేదా లాక్ డౌట్  సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితమైనప్పటికీ కేసుల సంఖ్య 20 వేల వరకు చేరింది అని బాధ పడాలా అన్నది ప్రస్తుతం భారత్లో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: