కరోనా ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఊహ కందని రేంజులో పెరుగుతూ వస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగా లాక్ డౌన్ విధించి ప్రజలను ఇళ్లలోనే ఉండేలా సూచిస్తుంది. దీంతో ప్రజలు అన్నీ వాణిజ్య వ్యాపారాలు మానేసి మరి ఇళ్లలోనే ఉంటూ కరోనా నియంత్రణలో శ్రమిస్తున్నారు. కరోనా కేసులు ఇప్పటికే 2లక్షలు దాటాయని తెలుస్తుంది.
కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు.. కుల మతాలకు అతీతంగా పేదలకు సాయం చేయడంలో ముండుకొస్తూ మరో సారి భారత దేశం సకల మత సమ్మేళనం అని నిరూపించింది .. దేశ వ్యాప్తంగా మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉంటూ కరోనా సోకకుండా జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు .
ఇందులో భాగంగా తెలంగాణా ప్రభుత్వం ఒక టీపీ కబురు అందజేసింది. మేలో ప్రతి కార్డుదారుడికీ ఉచితంగా అందించే బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, పంచదారను కూడా అందించాలని నిర్ణయించింది. రెండు కిలోల గోధుమలు, పంచదార మాత్రం సబ్సిడీ ధరపై అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 16 లక్షల 930 కుటుంబాలుండగా, అన్ని కార్డులనూ కలిపి 55,75,583 మందికి రేషన్ అందించాల్సి వుంది.
అందుకుగాను మొత్తం 6,83,06,702 కిలోల బియ్యాన్ని, 16 లక్షల 930 కిలోల కంది పప్పును, 32.18 లక్షల కిలోల గోధుమల కోటాను ఇప్పటికే సిద్ధం చేశారు. వీటిలో గోధుమలు, పంచదార రిలీజింగ్ ఆర్డర్ ను మీ సేవా ఆన్ లైన్ ద్వారా పొందవచ్చని, చెల్లింపులు కూడా అక్కడి నుంచే జరపాలని పౌర సరఫరాల శాఖ నుంచి డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. రేషన్ కు సంబందించిన అన్నీ పదార్థాలు నిల్వలు ఉన్నాయని తేల్చి చెప్పింది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి