ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.  రాష్ట్రంలో ఈరోజు  81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా బాధితుల సంఖ్య 1097కు చేరింది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో రెండు భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 
 
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఇబ్బందులు సృష్టిస్తున్న జీవోను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వం రెండు పరిశ్రమలకు మినహాయింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిటెడ్ మరియు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ లు అనంతపురం రానున్నాయి. వీర్ వాహన్ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ బస్సుల పరిశ్రమ స్థాపించనుంది. 
 
ఏరోస్పేస్ సంస్థ 246 ఎకరాల్లో ఏపీఐఐసీ భాగస్వామ్యంతో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ పార్క్ కూడా త్వరలోనే ఏర్పాటు కానుంది. ఈ రెండు కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదు కాకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెడ్ జోన్ ప్రాంతాల్లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ ఉండటంతో కొత్త కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.                            

మరింత సమాచారం తెలుసుకోండి: