లోకం చాలా విచిత్రమైనది.. అందులో మనుషుల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు.. తాను మునిగి పోతున్న పక్కవాడు కూడా తనతో మునిగిపోవాలని ఆలోచిస్తారు.. టూకీగా చెప్పాలంటే తాను బ్రతకకున్న ఫర్వాలేదు కానీ తన, తన నెత్తిమీద చావు కూర్చున్నా.. చూపులు మాత్రం పక్కవాడి మీదే ఉంటాయి.. ఇలా ఎందుకు అనవలసి వచ్చిందంటే.. బండలాంటి మనిషి.. నియంతకు ప్రతిరూపం అయినా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ మరణించాడని లోకం మొత్తం కోడై కూస్తుంది..

 

 

అయినా ఒకవేళ ఆ అధ్యక్షునికి ఏదైనా ప్రమాదం అయితే ఆ దేశమే అధికారికంగా ప్రకటిస్తుంది.. అంతవరకు ఆగలేక పోతున్న వారు ఏకంగా కిమ్‌ మరణించాడనే వార్తను బాగా ప్రచారంలోకి తెచ్చారు.. బ్రతుకు మీది ఆశతో కరోనా తగ్గే వరకు ఎక్కడైనా రహస్య ప్రదేశంలో తలదాచుకోవచ్చు అని అనుకోవచ్చు కదా.. కానీ అలా అనుకోలేదు సరికదా.. కిమ్‌ పైనే దృష్టి పెట్టి కరోనా వైరస్ కంటే ఎక్కువగా అతని గురించి ప్రచారం సాగిస్తున్నారు.. ఇలాంటి సమయంలో కిమ్‌ దేశానికి పక్కనే ఉన్న దక్షిణ కొరియా ఈ వార్తలను మరోసారి తోసిపుచ్చింది. ఆయన ‘సజీవంగా, క్షేమంగా’ ఉన్నారని, వోన్సాన్‌ ప్రాంతంలో బస చేసినట్లు తెలిపింది.

 

 

మరోవైపు కిమ్‌కు సంబంధించినదిగా భావిస్తున్న ఒక రైలు ఆ ప్రాంతంలో ఆగి ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ నెల 15న కిమ్‌ తన తాత 108వ జయంతి కార్యక్రమానికి గైర్హాజరైనప్పటి నుంచి కిమ్‌ విషయంలో రకరకాల వదంతులు వస్తున్నాయి. ఆయన మరణించి ఉంటారని హాంకాంగ్‌ శాటిలైట్‌ ఛానల్‌ తాజాగా పేర్కొన్న నేపధ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడికి విదేశీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న చుంగ్‌ ఇన్‌ మూన్‌ వీటిని ఖండించారు. ఈ నెల 13 నుంచి వోన్సాన్‌ ప్రాంతంలో కిమ్‌ బస చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద అంశాలేవీ ఆ దేశంలో వెలుగు చూడలేదని చెప్పారు.

 

 

కాగా ఇప్పటికే కిమ్‌ ఆరోగ్యంపై వార్తలు వచ్చిన నేపథ్యంలో చైనా ఒక వైద్య బృందాన్ని ఉత్తర కొరియాకు పంపిందన్న విషయం తెలిసిందే... ఇకపోతే కిమ్‌ ఆరోగ్యంపై వచ్చిన వార్తల్లో నిజం లేకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా ఇప్పటికే పేర్కొన్నారు.. కరోనా కాదుకదా ఇంకా భయంకరమైన వ్యాధులు వచ్చి పోతున్న పక్కవాడి విషయంలో వేలుపెట్టడం మానుకోదు ఈ సమాజం అని దీనిబట్టి అర్ధం అవుతుంది.... 

మరింత సమాచారం తెలుసుకోండి: