కొన్ని కొన్ని సార్లు మృత్యువు ఎటునుంచి ఇలా వచ్చి కబళిస్తుందో  ఊహకందని  విధంగా ఉంటుంది. మనం ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలేచినట్టు... ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ  ఓ  బాలున్ని  రెప్ప పాటు కాలంలో మృత్యువు కబళించింది. హాయిగా ఆడుకుంటున్న బాలున్ని  హైటెన్షన్ వైర్లు రూపంలో మృత్యువు కబళించి ప్రాణాలను పరలోకాలకు పంపించింది. ఈ ఘటనతో ఆ ఇంట్లో తీరని శోకం నిండిపోయింది. ఇంటి డాబాపై సదరు బాలుడు మేనత్త వడియాలు పెట్టింది. ఒడియాలు తీసుకొచ్చేందుకు డాబా పైకి వెళ్ళాడు బాలుడు . 

 

 వడియాలు అన్నిటినీ ఒకచోట చేర్చాడు... అనంతరం వాటిని తీసుకెళ్లేందుకు తన మేనత్త ను పిలిచేందుకు పిట్టగోడ వద్దకు వెళ్ళాడు. పిట్ట గోడ మీదనుంచి వంగి వంగి మరీ మేనత్తను పిలువసాగారు బాలుడు. ఈ క్రమంలోనే డాబా పక్కనుంచి వెళ్తున్నా విద్యుత్ హైటెన్షన్ వైర్లు ప్రమాదవశాత్తు ఆ బాలుడికి తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు ఆ బాలుడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించటం  తో పాటు ఆ ఇంట్లో విషాదం నింపింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

 

 అయితే అప్పుడు వరకు ఎంతో ఆనందంగా గడిపిన ఆ బాలుడు  నిమిషాల్లో  మృత్యువు ఒడిలోకి చేరాడు. అయితే విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మరణించాడు అని ఆరోపిస్తున్నారు స్థానికులు. హైటెన్షన్ వైర్లు ఇళ్లపై నుంచి వెళ్తున్నప్పటికీ విద్యుత్ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి పట్టించుకోలేదని విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రజల నివాసల కు సమీపంలో ఉన్న హైటెన్షన్ వైర్లు మార్చడానికి గతంలో నిధులు మంజూరు అయినప్పటికీ అధికారులు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదని... అధికారుల నిర్లక్ష్యానికి ఇప్పుడు ఒక బాలుడి ప్రాణం బలయ్యిందని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.ఆ బాలుడు మృతి తో కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: