దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 1000కు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నాయి. 
 
బయటకు వచ్చే సమయంలో తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. దేశంలో కొన్ని ప్రాంతాలలో ఈ నిబంధన కఠినంగా అమలవుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అయితే తాజాగా కర్ణాటక ప్రభుత్వం నిబంధనలు పాటించని వారికి ఊహించని షాక్ ఇచ్చింది. బహిరంగంగా ఉమ్మితే 500 రూపాయలు, మాస్కు ధరించకపోతే 100 రూపాయలు జరిమానా విధిస్తోంది. 
 
కరోనాను కట్టడి చేసేందుకు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధించాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించింది. నిబంధనలను పెడచెవిన పెడుతున్న ప్రజలు జరిమానాలు విధిస్తూ ఉండటంతో మాస్కులు ధరించి రోడ్లపైకి వస్తున్నారు. కర్ణాటకలోని శిమోగా సిటీ కార్పొరేషన్ లో మణి అనే వ్యక్తి మాస్కు ధరించకుండా రోడ్డు పైకి వచ్చాడు. 
 
మాస్కు ధరించకపోకవడంతో పాటు రోడ్డుపై ఉమ్మి వేశాడు. దీంతో పోలీసులు అతనికి మాస్కు ధరించనందుకు 100 రూపాయలు, ఉమ్మి వేసినందుకు 500 రూపాయలు ఫైన్ వేశారు. సోషల్ మీడియాలో జరిమానాకు సంబంధించిన బిల్లు వైరల్ అవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతూ ఉండగా ఏపీలోని మూడు జిల్లాల్లో మాత్రం వైరస్ వేగంగా విజృంభిస్తోంది.  కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ మూడు జిల్లాల్లో అధిక సంఖ్యలో కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: