తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నా.. మిగిలిన చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్ అనే చెప్పాలి. నాలుగైదు రోజులుగా కొత్త కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. వరుసగా మూడు రోజులపాటు పదిలోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 22 కేసులు నమోదయ్యాయి. ఏదేమైనా ఇది మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా తక్కువ.

 

 

అంతెందుకు.. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కనీసం రోజూ 60 నుంచి 80 వరకూ కొత్త కేసులు వస్తున్నాయి. అయితే తెలంగాణలో కొత్త కేసులు ఎక్కువగా రాకపోవడం కేసీఆర్ గొప్పదనం కాదంటున్నాయి విపక్షాలు. తెలంగాణలో కరోనా పరీక్షలను సరిగా నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నాయి. కరోనా అనుమానితులకు పరీక్షలు జరపాలని... లేకుంటే వాస్తవ పరిస్థితి తెలియకుండా పోతుందని అది ప్రమాదకరమని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.

 

 

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ చెబుతున్నట్లు 21 జిల్లాలలో కరోనా వైరస్ లేకపోతే ఆ జిల్లాలలో లాక్ డౌన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అసలు తెలంగాణలో కరోనా టెస్లులు జరగకపోవడానికి కారణం ఏమిటని నిలదీస్తున్నారు. పరీక్షల నిర్వహణకు నిధులు లేవా? పరీక్ష కిట్లు లేవా? లేక వాస్తవ పరిస్తితిని ఎదుర్కునే ధైర్యం లేకనా? అంటూ ఘాటుగా స్పందించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

 

 

కరోనాను అరికట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే, దాని ప్రభావం మొత్తం రాష్ట్ర ప్రజలపై పడుతుందని ఉత్తంకుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అనుమానితులందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. అయితే ఏపీ తరహాలో రోజూ ఎన్ని టెస్టులు చేస్తున్నారు.. ఎన్ని పాజిటివ్ వచ్చాయో క్లియర్ గా ప్రకటించడంలేదు. కేవలం కేసుల వివరాలు మాత్రమే వెల్లడించడం ఆరోపణలకు కారణమవుతోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: