ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల్లో కరోనా కలకలం రేగింది. ఢిల్లీ 10 టీవీ రిపోర్టర్ గోపికృష్ణకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. గోపికృష్ణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గోపికృష్ణకు కరోనా పాజిటివ్ తో పాటు షుగర్ సమస్య కూడా ఉందని వైద్యులు చెబుతున్నారు. 10 టీవీ రిపోర్టర్ గోపీకృష్ణకు కరోనా పాజటివ్ రావడంతో కేంద్ర సమాచార శాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు.


కరోనా పాజిటివ్ వచ్చిన గోపీకృష్ణ ఎవరెవరిని కలిసాడనే కోణంలో సమాచారం సేకరిస్తున్నారు. గోపికృష్ణ కుటుంబ సభ్యులకు కూడా ముందు జాగ్రత్త చర్యగా కరోనా టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. రిపోర్టర్ అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఎందరినో కలుస్తుంటారు. దాంతో ఇప్పుడు ఆయన ఎవరిని కలిశారనే అంశంపై సమచారం సేకరిస్తున్నారు.

 

 

10 టీవీ రిపోర్టర్ కు కరోనా పాజిటివ్ అని నిర్థరణ కావడంతో తెలుగు జర్నలిస్టుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. 10 టీవీ రిపోర్టర్ గోపీకృష్ణను కలిసిన వారంతా ఇప్పుడు ఆందోళనలో పడిపోయారు. సాధారణంగా మీడియా జర్నలిస్టులంతా ఓ జట్టుగా తిరుగుతుంటారు. ప్రెస్ మీట్లకు వెళ్తుంటారు. అందులోనూ ఢిల్లీలో తెలుగు జర్నలిస్టులు తక్కువగా ఉంటారు కాబట్టి అంతా ఓ జట్టుగా ఉంటారు. అందుకే ఇప్పుడు వారిలో ఎవరికి కరోనా సోకి ఉంటుందో అన్న ఆందోళన కనిపిస్తోంది.

 

 

అందుకే ఢిల్లీలోని తెలుగు పాత్రికేయులందరికీ కరోనా టెస్టులు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు సమచారం. 10 టీవీ రిపోర్టర్ ద్వారా కరోనా మిగిలిన జర్నలిస్టులకూ వ్యాపించలేదని ఆశిద్దాం.. తెలుగురాష్ట్రాల నుంచి ఉపాధి కోసం రాజధానికి వెళ్లిన పాత్రికేయులు ఆరోగ్యంగా ఉండాలని ఇండియా హెరాల్డ్ కోరుకుంటోంది. కరోనా పాజిటివ్ వచ్చిన గోపీకృష్ణ అతి త్వరలోనే కోలుకోవాలని ఆకాంక్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: