కరోనా మహమ్మారి వల్ల చాలారోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అత్యవసర సేవలు తప్ప మిగతా సేవలు అన్ని నిలిచిపోయాయి. ఇదే క్రమంలో వైన్ షాప్స్, బార్లు కూడా మూసుకుపోయాయి. దీంతో మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డారు. షాపులు ఎప్పుడు ఓపెన్ చేస్తారని చకోర పక్షులు మాదిరిగా ఎదురు చూసారు. కానీ లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. కానీ తాజాగా మరోసారి లాక్ డౌన్ పెరిగినా, జోన్ల వారికి సడలింపు దొరికింది.

 

ఈ క్రమంలోనే ఏపీలో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. లాక్ డౌన్ వల్ల ఆదాయం నానాటికీ దిగజారిపోవడంతో సీఎం జగన్...సామజిక దూరం పాటిస్తూ, మాస్కులు వాడుతూ, కరోనా సోకకుండా జాగ్రత్తలు వహిస్తూ మద్యం అమ్మకాలు కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసారు. మద్యం షాపులు ఓపెన్ కానుండటంతో మందుబాబుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఇలాంటి సమయంలో మద్యం షాపులు ఓపెన్ చేయడంపై ప్రతిపక్ష మహిళా నేతలు విమర్శలు చేస్తున్నారు.

 

మద్యం దుకాణాలు బంద్ కారణంగా  ప్రజల ఆరోగ్యం బాగుపడడమే కాక, క్రైమ్ రేట్, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అంటున్నారు. ఎలాగో దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తామని జగన్ చెప్పారు కాబట్టి, ఆ హామీని ఇప్పుడు నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. ఇలాంటి టైంలో షాపులు ఓపెన్ చేస్తే మద్యానికి అలవాటైన పేద వర్గాలని ఆపలేమని, షాపులు తెరిస్తే కార్మికులు, కూలీలు, పేదవాళ్లు అప్పులు చేసి, బంగారాన్ని తాకట్టు పెట్టి తాగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

ఈ విధంగా ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతాయని, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జగన్ మద్యం దుకాణాలను తెరవడం ఆపాలని కోరుతున్నారు. అయితే అదే పేదలకు అండగా ఉండాలంటే ఆదాయం ఉండాలని, అది లేకపోతే ప్రభుత్వం ఏమి చేయలేదని, కాబట్టి ఎక్కువ ఆదాయం వచ్చే మద్యం దుకాణాలని తెరిపించడం తప్పదని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: