ప్రపంచంలో అగ్రరాజ్యంగా ధనిక దేశంగా పిలవబడే అమెరికా పరిస్థితి కరోనా వైరస్ రాకతో పూర్తిగా మారిపోయింది. తన కంటి చూపుతో హెచ్చరికలతో శాసించే విధంగా బలమైన దేశంగా ఉన్న అమెరికా లో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో వ్యాపించి ఉంది. రోజురోజుకీ పాజిటివ్ కేసులు మరియు మరణాలు ఎక్కువ సంభవిస్తున్న దేశంగా ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా వైరస్ వచ్చినా ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం భారీ మూల్యాన్ని చెల్లిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ తో పాటు ప్రాణా నష్టం కూడా బాగా జరిగింది.

 

అని దేశలో కెల్లా కరోనా వైరస్ వల్ల ఒక పక్క ఆర్ధిక నష్టం మరొక పక్క ప్రాణనష్టం అత్యధికంగా జరిగిన దేశంగా  అమెరికా అంతర్జాతీయ మీడియాలో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. అటువంటి అమెరికాలో ప్రస్తుతం ఉద్యోగాలు ఉపాధి లేకపోవటంతో ఇంటి అద్దె కట్టడానికి నానా యాతన పడుతున్నారు అమెరికన్లు. కరోనా వైరస్ కారణంగా అధికారికంగా అందుతున్న లెక్కల ప్రకారం కోట్లాదిమంది అమెరికాలో ఉద్యోగాలు కోల్పోవడం జరిగిందట. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికన్లు తమ ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేక ప్రభుత్వంపై నిరసనలు చేపడుతున్నారు. నో మనీ.. నో రెంట్ అంటూ వారు తమ అద్దెల్ని ప్రభుత్వం రద్దు చేయాలని కోరుతున్నారు. నిరసనకారులు చేస్తున్న నిరసలనకు ప్రతిపక్ష డెమొక్రాట్లు సైతం మద్దతు పలుకుతున్నారు.

 

ముఖ్యంగా సంపన్నులు ఉండే న్యూయార్క్ వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఒక విధంగా చెప్పాలంటే ధనిక దేశమైన అమెరికా లో అద్దెలు చెల్లించే విషయంలో మన దేశం కంటే దారుణమైన పరిస్థితి ఏర్పడింది. లాక్ డౌన్ కారణంగా మన దేశంలో మూడు నెలల పాటు అద్దెలు చెల్లించనవసరం లేదని కేంద్రం తెలపటం మనకందరికీ తెలిసినదే. కానీ అమెరికాలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం అద్దెలు చెల్లించాలని ఎక్కడికక్కడ అమెరికన్లు నిరసనలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: