అప్పట్లో కవి శ్రీశ్రీ చెప్పినట్లు కాదేదీ కవితకు అనర్హం.. ఇప్పుడు కరోనా వైరస్ పరిస్థితి కూడా అంతే.. ఎక్కడ ఎక్కడ ఉంటుందో ఎలా వ్యాపిస్తుందో అర్థం కాని అయోమయం నెలకొంది.  మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ ఎన్నో రకాలుగా ప్రబలిపోతుందని.. అందుకే భౌతికదూరం పాటించాలని అంటున్నారు.  అయితే ఈ కరోనా వైరస్ కంటికి కనిపించని శత్రువు.. ఏ వస్తువులపై ఉంటుందో తెలియదు.   ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే దాని పని అది చేయడం ఇప్పుడు జనాలను తీవ్రంగా కలవరపెడుతుంది.  ఏదోక రూపంలో దాడి చేయడం ఇపుడు ప్రజలకు కంటి మీద కునుకు ఉంచడం లేదు. తాజాగా 28 మంది కూరగాయల వ్యాపారులకు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో కరోనా సోకింది.

 

కూరగాయలు ఎవరు కొన్నారు, వారు ఎక్కడ తిరిగారు, వాళ్లకు కరోనా ఉందా లేదా అనే దాని మీద చైన్ ని బ్రేక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. 160 మంది వీధి వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, కిరాణా దుకాణాల వ్యాపారులకు కరోనా పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్ వచ్చింది. దాంతో అక్కడ కూరగాయలు ప్యాకెట్లలో అమ్మడం మొదలు పెట్టారు.  అయితే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూరగాయలు కొనాలంటే జనాలు భయపడిపోతున్నారు.  

 

ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు.  కూరగాయాలు కొనే సమయంలో చేతి గ్లౌజులు వాడితే మంచిది అని, కూరగాయలు కొన్న తర్వాత ఉప్పు నీళ్ళల్లో కడిగి కాసేపు ఆరబెడితే మంచిది అని సూచిస్తున్నారు. నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఆన్ లైన్ పద్దతుల్లో పే చేస్తే మంచిదని అంటున్నారు. అలాగే కూరగాయలను ఉప్పుతో పరిశుభ్రంగా కడిగితే చాలా మంచిదని అంటున్నారు. కాగా, కరోనా సోకిన నేపథ్యంలో 28 మంది కుటుంబ సభ్యుల సహా 2000 మందిని క్వారంటైన్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: