దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనాను కట్టడి చేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అవుతున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో కరోనాను కట్టడి చేయడం సాధ్యమేనని తెలుస్తోంది. మానవులకు కరోనా సోకకుండా చేయడంలో శాస్త్రవేత్తలు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. 
 
ఉట్రేచ్ట్‌ యూనివర్సిటీలోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అండ్ హార్బర్ బయోమెడ్‌ శాస్త్రవేత్తలు మానవ శరీరంలోకి కరోనా సోకకుండా అడ్డుకునే యాంటీబాడీలను గుర్తించారు. కరోనాను కట్టడి చేయడంలో ఇది కీలక అడుగు అని పేర్కొన్నారు. యాంటీ బాడీ శరీరంలో ఒక కణాన్ని పట్టుకుని కరోనాను కట్టడి చేస్తుందని పేర్కొన్నారు. డాక్టర్ బాష్ ఈ పరిశోధనకు అధ్యక్షత వహించారు. 
 
యాంటీ బాడీకి క్రాస్ న్యూట్రలైజింగ్ గుణం ఉంటుందని... ఇది కరోనాను అడ్దుకోవడంలో కరోనాను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. సార్స్ కోవ్‌ 1 యాంటీ బాడీలను ఉపయోగించి మానవులకు కరోనా సోకకుండా అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. హెచ్‌బీఎం ఛైర్మన్‌ డాక్టర్ జింగ్‌సాంగ్ వాంగ్ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో ముందడుగులు పడుతున్నాయని పేర్కొన్నారు. 
 
యాంటీ బాడీ వ్యాధి తీవ్రతను ఏ మేరకు కట్టడి చేస్తుందనే విషయాలపై పరిశోధనలు సాగించాల్సి ఉందని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ పరిశోధన మంచి ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మరోవైపు దేశంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,000కు చేరువలో ఉండగా మృతుల సంఖ్య 1500కు చేరువవుతోంది. మరోవైపు తెలంగాణ కరోనా తగ్గుముఖం పడుతుండగా ఏపీలో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తెలంగాణలో నిన్న మూడు కరోనా కేసులు నమోదు కాగా ఏపీలో గడచిన 24 గంటల్లో 67 కేసులు నమోదయ్యాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: