ప్రస్తుతం కరోనా  వైరస్ చాపకింద నీరులా ప్రపంచం మొత్తం పాకుతూ శర  వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తూ ఎంతో మందిని ప్రాణ భయంతో వణికిస్తుంది ఈ మహమ్మారి వైరస్. ఎక్కడో ఒకచోట తగ్గుముఖం పట్టిన దాదాపు అన్ని చోట్ల మాత్రం వేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. కొన్నాళ్లపాటు ఈ మహమ్మారి వైరస్ తో సహజీవనం తప్పదు అని నిపుణులు కూడా చెబుతున్న విషయం తెలిసిందే . ఇక ఈ వైరస్ వెలుగులోకి వచ్చే నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన విరుగుడు మాత్రం అందుబాటులో లేకపోవడం ప్రస్తుతం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. 

 

 

 ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కరుణ వైరస్పై ఎన్నో పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే. కొన్ని  పరిశోధనలు కరోనా వైరస్ కు మందు కనిపెట్టేందుకు జరుగుతుంటే కొన్ని పరిశోధనలు మూలాలను కనుగొనేందుకు జరుగుతున్నాయి. మరోవైపు ఈ మహమ్మారి వైరస్ కేంద్ర స్థానంగా ఉన్న చైనా దేశం పై ప్రపంచ దేశాలు మొత్తం విరుచుకుపడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల విమర్శలను చైనా కొట్టి పారేస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో  ఎంతోమంది ఈ మహమ్మారి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతుండటంతో  పాటు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోంది. ముఖ్యంగా అగ్ర  రాజ్యమైన అమెరికా చైనా దేశం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే శాస్త్రవేత్తలందరూ కరోనా  వైరస్ సోకిన మొదటి పేషెంట్ గురించి అన్వేషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ అధ్యయనంలో  తో సంచలన నిజం బయట పడింది.. కరోనా  వైరస్ గురించి చైనా దేశం అధికారికంగా ప్రకటించడానికి ముందే కరోనా లక్షణాలతో బాధపడుతున్న పేషెంట్లను ఫ్రాన్స్లో గుర్తించినట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. పారిస్లోని అవిసెనే  అండ్  జీన్ వెర్డెర్  ఆస్పత్రిలో ఇన్ఫ్లుఎంజా లక్షణాలతో బాధపడుతున్న 14 మంది రోగుల నుంచి సేకరించిన నమూనాల్లో ఓ  42 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకిన నిర్ధారణ అయిందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఆంటీ మైక్రోబియల్ ఏజెంట్స్  పేర్కొంది. సదరు పేషెంట్స్ డిసెంబర్ 27న ఆసుపత్రిలో చేరగా ... అతడు చైనా వెళ్లి వచ్చినట్లుగా ఎలాంటి ప్రయాణ చరిత్ర కూడా లేదు అంటూ వెల్లడించింది. ఇక ఈ విషయంపై మాట్లాడినా అవిసెనే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగాధిపతి హోలీవేర్ బౌచార్డ్  మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా  వేగంగా వ్యాప్తి చెందుతుందని ఈ వైరస్ బారిన పడ్డమన్న ఆయా వ్యక్తులకు  కూడా  తెలియదు అంటూ పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: