హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర లో ఉన్న టీవీ 5 ప్రధాన కార్యాలయంపై గత అర్ధరాత్రి రాళ్ల దాడి జరిగిన సంఘటన తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారు ఎవరు అనేది ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ, దీనిపై పెద్ద రాద్దాంతం జరుగుతున్నా, ముఖ్యంగా ఈ సంఘటనకు పాల్పడింది ఏపీకి చెందిన ఒక పార్టీగా  టీవీ 5 ఛానల్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సంఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు లభించలేదు. ఈ ఈ రాళ్ల దాడిలో ఆ ఛానెల్ ప్రధాన కార్యాలయం అద్దాలు పగిలాయి. 

IHG


ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఏపీలో రాజకీయ పార్టీల మధ్య ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు కరోనా, మరోవైపు విశాఖ లో గ్యాస్ లీకేజీ ఘటనతో ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలోనే టీవీ5 ప్రధాన కార్యాలయంపై దాడి జరగడం మరింత దుమారం రేపింది. ఇదిలా ఉంటే ఈ సంఘటనకు సంబంధించి పార్టీలకు అతీతంగా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ఈ సంఘటనను ఖండించాయి.

 


 తాజాగా తెలంగాణ ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ సంఘటనను ఖండించింది. "వాస్తవాలు జీర్ణించుకోలేక ఇలాంటి దాడులకు పాల్పడ్డారు. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం గా ఉన్న మీడియాపై దాడులు చేయడానికి తీవ్ర నేరంగా పరిగణించాలని "TFJA" తరపున అధ్యక్షుడు లక్ష్మీనారాయణ పోలీస్ వారిని కోరారు..." అంటూ ట్విట్టర్ ద్వారా ఖండించారు. ఇక టీవీ 5 ప్రధాన కార్యాలయం పై జరిగిన దాడి వ్యవహారం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. చాలా కాలంగా టీవీ 5 వ్యవహారం వార్తల్లో ఉంటూ వస్తోంది. 


వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఈ ఛానల్ మారడంతో తరచుగా ఏదో ఒక దుమారం రేగుతూనే ఉంది. ఈ సంస్థలో పనిచేసే డిబేట్ జర్నలిస్ట్ పై ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని, అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే చివరకు అదంతా ఏమి జరగకపోవడంతో, సైలెంట్ అయింది. ఇప్పుడు ఈ వ్యవహారం చోటుచేసుకోవడంతో మరింత దుమారం చెలరేగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: