దేశ ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏకంగా 20 లక్షల కోట్ల పాకేజీని  ప్రకటించిన విషయం తెలిసిందే. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏ రంగాలకు ఎంత మొత్తంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించబడుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ నిన్న మొదటి విడత ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది అంటూ చెప్పుకొచ్చారు నిర్మల సీతారామన్. అంతేకాకుండా పలు శాఖలకు కేటాయింపులు కూడా జరిపారు. 

 

 

 ఇక తాజాగా ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ రెండో విడత ప్యాకేజీని ప్రకటిస్తున్నారు. నిన్న సుమారు ఆరు లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్... ఈరోజు మరో విడత ప్యాకేజీని ప్రకటించనున్నారు. ఇక ఈ రెండవ విడత ప్యాకేజీలో భాగంగా నిర్మల సీతారామన్ ఏకంగా  9 రంగాలకు సంబంధించి కేటాయింపులు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా లాక్ డౌట్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో పేదల అభ్యున్నతికి ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. 

 

 

 ఇక రైతులకు సహాయం అందించడానికి ఏకంగా నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయింపు జరిపారు నిర్మల సీతారామన్. రైతులకు చెల్లింపు విషయంలో కూడా గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక వలస కూలీల పునరావాసం కోసం ఏకంగా పదకొండు వేల కోట్లు కేటాయించారు నిర్మల సీతారామన్. పట్టణాలు నగరాల లోని ప్రజల కోసం సహాయక నిధులు కూడా కేటాయించినట్లు తెలిపారు. అంతేకాకుండా 1.2 లక్షల లీటర్ల శానిటైసర్ లు  కూడా పంపిణీ చేస్తామని  ఈ సందర్భంగా వెల్లడించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.

మరింత సమాచారం తెలుసుకోండి: