మూలిగే నక్కమీద వాత పడ్డట్టు అన్న సామెత గుర్తుంది కదా.. ఇప్పుడు మాంసం ప్రియుల పరిస్థితి ఇలాగే ఉంది.  మొన్నటి వరకు కరోనా భయంతో చికెన్ రేట్లు ఒక్కసారే రూ.25 లకు పడిపోయిన విషయం తెలిసిందే.  కానీ ఇప్పుడు చికెన్ షాప్ వైపు సామాన్యుడు చూడలేని పరిస్థితి నెలకొంది.  గత కొన్ని రోజుల నుంచి మాంసం ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అమ్ముతున్నారు.  తెలంగాణ సర్కార్ మాంసం రూ.700 లకే అమ్మాలని రూల్ తీసుకు వచ్చింది.  కానీ చికెన్ కి మాత్రం ఎలాంటి ధర నిర్ణయించడం లేదు. పైగా చికెన్ తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగిపోతుందని అంటున్నారు.

 

దాంతో మాంసం ప్రియులు మటన్ వదిలి చికెన్ కే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.. దాంతో చికెన్ రేట్ ఆకాశాన్నంటుంతుంది. ఏపీలో అమాంతం పెరిగిన చికెన్ రేట్లు.. రెండు వారాలుగా కిలో రూ.200 లోపు ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా రూ.300 దాటింది. ఇటు కోడి గుడ్డు ధరలు కూడా పెరిగాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కిలో చికెన్‌ అత్యధిక  ధర రూ. 260 పలికింది. ఇదే ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోయింది. కిలో రూ. 310 అనేది దేశంలోకెల్లా అత్యధిక ధర కావడం గమనార్హం. అంతే కాదు ముందు ముందు ఈ ధర కూడా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.  

 

గతంలో కరోనా కారణంగా చికెన్‌ ధరలు దారుణంగా క్షీణించడంతో పౌల్ట్రీ రైతులు కుదేలైపోయారు. ఆర్థికంగా నష్టపోయిన వీరు ఫారాల్లో కోళ్ల పెంపకాన్ని 60 శాతానికి పైగా తగ్గించారు. ఆ తర్వాత క్రమంగా చికెన్‌ కొనుగోళ్లు పెరిగాయి.  కోళ్ల ఫారాలన్నీ త్వరగానే ఖాళీ అవుతున్నాయి. డిమాండ్‌కు తగ్గట్లుగా సప్లై లేకపోవడం.. మార్కెట్‌ కొరతను గుర్తించి ధరలు పెంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: