చిరంజీవి రాజకీయాలు వదిలేశారు, సినిమాలు చూసుకుంటున్నారు. ఇది ఇపుడు మాట. అయితే చిరంజీవి ఒక పార్టీకి ప్రెసిడెంట్. అదే విధంగా ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఒక సారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్న చిరంజీవికి రాజకీయం అంత సులువుగా వదులుతుందా.

 


చిరంజీవి సినీ పరిశ్రమలో  చిన్న నటుడుగా ప్రవేశించి మెగాస్టార్ అయ్యారు.  కొన్నాళ్ళ పాటు సాగిన రాజకీయాల తరువాత మళ్ళీ ముఖానికి రంగు వేసుకున్నారు.  తన ఒంటికి రాజకీయాలు పడవని భావించి 2018లో హుందాగా తప్పుకున్నారు. నిజానికి మెగాస్టార్ కి వర్తమాన రాజకీయాలు రోతగానే ఉన్నాయి.

 

ఒకటి అనడం నాలుగు పడడం ఆయనకు అసలు కుదిరే పని కాదు, ఇక సినిమాల్లో వచ్చిన మంచి పేరునే కాపాడుకుంటూ అక్కడే పూర్తిగా ఉండాలని చిరంజీవి స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారు.  అయితే ఆయన రాజకీయం వదిలేసినా ఆయన ఇంట్లోనే రాజకీయం ఉంది. అది వదలను అంటోంది. తమ్ముడు పార్టీ పెట్టాడు, ఇంకో  తమ్ముడు ఎంపీగా పోటీ చేశాడు. అందువల్ల చిరంజీవికి ఈ రాజకీయ బాధ తప్పడంలేదుట.

 


ఇలాంటి గందరగోళం మధ్య చిరంజీవి తమ్ముడికి జై అనేయడం విశేషం. ఈ మధ్య ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవి ఇంట్లో  తన తమ్ముడు పార్టీ ఉండగా తమంతా మద్దతు ఇవ్వడమే కరెక్ట్ అనేశారు. అంటే తమ ఇంట్లో రెండవ పార్టీకి చోటు లేదని చెప్పేశారు. ఆ విధంగా తన రాజకీయం ముగిసినా కూడా చిరంజీవి తమ్ముడి పార్టీకి మొగ్గు అని చెప్పుకోవాల్సివచ్చింది.

 


ఇది చిరంజీవి అభిప్రాయంగా ఉంది, కానీ  ఇప్పటికైతే ఆయన రాజకీయాల్లో లేరు, సినిమాల్లో మాత్రమే ఉన్నారు. రేపటి రోజున ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అన్నది కూడా చర్చగా ఉంది.  చిరంజీవి కూడా తమ్ముడి పార్టీ వైపు అసక్తి చూపించడంతో ఇక ఆయన పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే చిరంజీవి చేరినా చేరకపోయినా ఆయన పేరు వాడుకుంటే జనసేనకు పెద్ద అసెట్. ఎందుకంటే ఇప్పటికీ మెగాస్టార్ కి దండీగా అభిమానులు ఉన్నారు.

 

ఆయన జనసేనలో చేరనక్కరలేదు. ఎన్నికల వేళ జనసేనకు అనుకూలంగా ట్వీట్లు చేసినా వీడియో మేసేజులు ఇచ్చినా ఆ ఇంపాక్టు ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఇది చాలదూ అనుకుంటే ముగ్గురు అన్నదమ్ములూ  ఏకంగా రాజకీయ వేదిక మీద కనిపించి అయినా జనసేనకు  కొత్త బలాన్ని తెచ్చేలాగా సీన్ కనిపిస్తోంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: