తెలంగాణలో లాక్ డౌన్  సడలింపులు చిన్నప్పటి నుంచి కరోనా  వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువ ఉన్న విషయం తెలిసిందే. అంతకు ముందు కేవలం 67 కొత్త కేసులు మాత్రమే వెలుగులోకి రాగా  సడలింపులు  ఇచ్చిన నాటి నుంచి దాదాపు ప్రతిరోజు 50 కి పైగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చేలా కనిపిస్తోంది. సామాజిక దూరం పాటించకపోవటం  కరరోనా  వైరస్ లక్షణాలు ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా శరవేగంగా అందరికీ వ్యాప్తిచెందుతుంది ఈ మహమ్మారి వైరస్. 

 

 

 తాజాగా పటాన్ చెరులో  తండ్రి కొడుకులు కరోనా  వైరస్ బారిన పడడం సంచలనంగా మారింది. పటాన్చెరు పరిధిలోని ఇంద్రేశం లో ఎన్నారై సిటిజన్ కాలనీకి చెందిన తండ్రి కొడుకులు ఈ మహమ్మారి వైరస్ బారిన పడ్డారు. అయితే కాస్త జ్వరంగా  ఉండడంతో పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి నార్మల్ చెకప్ కోసం వచ్చిన ఇద్దరికీ కరోనా  వైరస్ లక్షణాలు కనిపించడంతో... వెంటనే అప్రమత్తమైన వైద్యులు  వారి నుంచి శాంపిల్స్ తీసుకుని పరీక్షలకు పంపగా వారికీ కరోనా సోకినట్లు నిర్దారణ అయింది. తాజాగా ఈ విషయాన్ని ఆరోగ్య అధికారి అధికారికంగా వెల్లడించారు. 

 

 

 ఇక మరో విషయం ఏమిటంటే కరోనా  వైరస్ సోకిన వ్యక్తులు... పటాన్చెరు లోని పలు ప్రాంతాల్లో సంచరించినట్లు తెలుస్తోంది... పటాన్చెరు మార్కెట్,  కిరాణా షాపులు,  వాటర్ ప్లాంట్ లాంటి ప్రాంతాల్లో కరోనా పేషంట్లు సంచరించగా.. ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు పోలీసులు. కరోనా  వైరస్ సోకిన వ్యక్తి ఉండే ఇంటి పరిసరాలలో  ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: