తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినది దేవస్థానం . దేశం నలుమూలల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తూ  ఉంటారు. భక్తుల కోరికలు తీర్చే బంగారు దైవంగా శ్రీవారు తిరుమలలో విరాజిల్లుతారు. తిరుమలలో  దేదీప్యమానంగా వెలుగొందుతున్న  స్వామి వారి దివ్య మూర్తిని ఒకసారి దర్శించుకుంటే చాలు సర్వ పాపాలు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 

 


 అయితే స్వామివారికి ప్రతీరోజూ ఎన్నో పూజలు జరుగుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ప్రతీ పూటకి వివిధ రకాల నైవేద్యాలు.. ఎన్నో రకాల పానీయాలు సమర్పిస్తారు..స్వామి వారికీ ప్రతిరోజూ స్వామివారికి ఎన్నో విభిన్నమైన కాంకర్యాలు  సమర్పించాల్సి ఉంటుంది. రోజు రోజు స్వామివారికి అందించే నైవేద్యం మెనూ మారుతూ వుంటుంది. అంతేకాకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్వామివారికి ఎన్నో రకాలైన నైవేద్యాలను సమర్పిస్తూ వుంటారు. ఇక రుతువులు మారుతున్న కొద్దీ స్వామి సమర్పించే నైవేద్యం మెనూ కూడా మార్పు వస్తుంది.

 


 అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకప్పుడు స్వామివారి ప్రధాన అర్చకులు అయినా.. రమణ దీక్షితులు కి  పూర్తిగా తెలుసు. ఒకప్పుడు పలు  వివాదాల కారణంగా స్వామివారి ప్రధాన అర్చకులుగా తొలగించబడిన రమణదీక్షితులును  ప్రస్తుతం.. మరో  కీలక పదవిలో కి తీసుకున్న విషయం తెలిసిందే. రమణదీక్షితులు ఎన్నో ఏళ్ల పాటు స్వామివారికి ప్రధాన అర్చకులుగా కొనసాగి  స్వామివారి కైంకర్యాలకు స్వయంగా నిర్వహించారు . స్వామివారి కైంకర్యాలకు ఏంటి ఆయన సమర్పించే నైవేద్యం ఏమిటి చెప్పగలరు. అయితే స్వామివారికి సమర్పించే నైవేద్యం, కంకార్యాలకు  సంబంధించి ఆయన ఒక పుస్తకం రాశారు. ది సీక్రెట్ ఫుడ్  ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రాశారు. ఈ పుస్తకంలోని పూర్తి వివరాలు ఈ కింది వీడియోలో ఉన్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: