అనుమానం పెనుభూతం అంటూ చెబుతారు పెద్దలు. ఏ బంధంలో అయిన  నమ్మకం అనేది ఎంతో ముఖ్యం.. ఒకసారి అనుమానం మొదలయింది అంటే అది పెనుభూతం లా  పెరిగి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటిదే  జరిగింది... ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏ కష్టం లేకుండా చూసుకుంటాను అన్నాడు. వారి దాంపత్య జీవితానికి ఆరేళ్లు గడిచిపోయింది... వారిద్దరి ప్రేమ కి ప్రతిరూపం కాగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ ఆ తర్వాత వారిద్దరి మధ్య అనుమానం  పుట్టింది. దీంతో మద్యానికి బానిసైన భర్త రోజు భార్యను  అనుమానంతో వేధించేవాడు.రోజురోజుకు  అనుమానం పెరిగి పోవడంతో వారిని అతి కిరాతకంగా చంపేశారు. 

 

 ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో  చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... పిప్పర గ్రామానికి చెందిన బోయ నరేష్ అదే గ్రామానికి చెందిన వెంకటరమణ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాటు వీరి సంసార జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది. ఇక వీరిద్దరి ప్రేమకి గుర్తుగా పావని దుర్గా,  హర్ష అనే ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కానీ ఇంతలో భర్త నరేష్ మద్యానికి బానిస అయిపోయాడు. ఈ క్రమంలోనే భార్యపై అనుమానం కూడా పెంచుకున్నాడు.  ఏదోవిధంగా అనుమానిస్తూ భార్యను వేధిస్తూనే ఉండేవాడు. భార్యకు ఇతరులతో అక్రమ సంబంధాలు అంటగట్టి చిత్రహింసలకు గురి చేసే వాడు. 

 

 ఈ క్రమంలోనే సోమవారం కూడా ఫుల్లుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు నరేష్. ఇంతలో భార్యతో గొడవపడి కోపోద్రిక్తుడై భార్య పై చేయి చేసుకున్నాడు.ఇక  భర్త చేష్టలతో అలిగిన భార్య తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి పోయింది. దీంతో నరేష్ మరింత కోపంతో రగిలిపోయాడు.. ఇక ఆ తర్వాత రోజు మంగళవారం మధ్యాహ్నం మళ్లీ ఫుల్లుగా మద్యం తాగి అత్త వారి ఇంటికి వెళ్లి వారితో గొడవ పడ్డాడు. దీంతో భార్య భర్తల మధ్య తలెత్తిన వివాదం కాస్త చిలికిచిలికి గాలివానలా కావడంతో.. కోపోద్రిక్తుడు అయిన భర్త నరేష్ తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా భార్య పై దాడి చేసాడు . ఇక ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు మహిళను  తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న నరేష్ నేరుగా గణపవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయాడు. ఇక మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: