ఒక వైపు కరోనా వైరస్ ఉండగా, మరోవైపు సైబర్ నేరగాళ్లు వారి పనిలో వారు ఉన్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో వారి నుండి కాస్త సమస్యలు ఎక్కువ అయ్యాయి. ఈ తరుణంలో కరోనా సమాచారం అందిస్తాము అంటూ మొబైల్స్ కు వచ్చే మెసేజ్ లతో చాలా జాగ్రత్తగా ఉండాలి అని CID అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే సైబర్ కేటుగాళ్లు పంపిన లింకులను ఎటువంటి పరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దు అని హెచ్చరిస్తున్నారు. 

 


ఒకవేళ ఆ లింకు క్లిక్ చేసిన ఇన్స్టాల్ చేసేందుకు అనుమతి ఇవ్వదు అని అధికారులు తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పనులు చేస్తే మొబైల్ కాంటాక్ట్స్, ఇతర సమాచారాన్ని జాగ్రత్త పరుచుకోవడం మంచిది అని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫోన్ రీసెట్ చేసుకోవడం చాలా మంచిది అని CID అధికారులు తెలియజేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు శర్మ అనే బ్యాంకింగ్ మెసేజ్ మొబైల్స్ కు పంపి వారి అకౌంట్ లో డబ్బులు ఖాళీ చేసినట్లు సిఐడి అధికారులు ఖాతాదారులకు హెచ్చరిస్తున్నారు. 

 

సైబర్ కేటుగాళ్లు పంపిన లింకులను ఫోన్లలో ఉంచితే క్రెడిట్, డెబిట్ కార్డ్ వివరాలు వారి చేతిలోకి పోయినట్లే. నిమిషాల్లోనే అకౌంట్లోని డబ్బులు మాయం చేస్తున్నారు ఈ కేటుగాళ్లు. ఎక్కువగా వీరు కరోనా సమాచారం అందిస్తాము అంటూ ఫోన్ లకు మెసేజ్ లు పంపిస్తున్నారు. ఒకవేళ మీరు ఆ లింక్ పై క్లిక్ చేస్తే మొబైల్ సర్వర్ లో వచ్చి చేరుకుంది. ఆ లింకు పై క్లిక్  చేయగానే మొబైల్ లో ఉండే సమాచారం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఫోన్ లో ఉండే ఫోన్ బ్యాంకింగ్ యాప్, బ్రౌజర్ ఫోన్, నెట్ బ్యాంకింగ్ తో అన్నీ లాగిన్ అవుతారు. అలాగే యూజర్ నేమ్, పాస్ వర్డ్ వివరాలతో బ్యాంకుకు సంబంధించిన ఈ వివరాలు ఓటీపీ లతో ఓపెన్ చేసుకుంటారు. అలాగే ఎవరైనా పర్సనల్ వివరాలు సెల్ ఫోన్ లో సేవ్ చేసుకొని ఉంటే అవి సేకరించి నిమిషాలలో అకౌంట్లో డబ్బులు మాయం చేస్తారు. కనుక అపరిచిత లింకులపై జాగ్రత్తగా ఉండాలి అని ప్రజలకు CID అధికారులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: