తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మరలా విజృంభిస్తోంది. రాష్టంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో  నిన్న 52 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ కేసులు నమోదవుతూ ఉండటంతో నగరవాసులు టెన్షన్ పడుతున్నారు. 
 
నిన్న నమోదైన కేసుల్లో 33 కరోనా కేసులు గ్రేటర్ హైదరాద్ లోనే నమోదయ్యాయి. మిగిలిన 19 కేసుల్లో వలస కార్మికులే కరోనా భారీన పడటం గమనార్హం. రాష్ట్రంలో కొత్తగా కువైట్ వచ్చిన నలుగురికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో అధికారులకు మరో కొత్త టెన్షన్ మొదలైంది. రాష్ట్రంలో మొదట ఢిల్లీ మర్కజ్ కు హాజరైన వారు, వారి కుటుంబీకులు కరోనా భారీన పడ్డారు. రాష్ట్రంలో మర్కజ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
ఒకానొక దశలో రాష్ట్రంలో కేవలం 3 కేసులు నమోదయ్యాయి. కానీ కేంద్రం వలస కార్మికులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి భారీ సంఖ్యలో వలస కార్మికులు వచ్చారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా కరోనా భారీన పడుతున్నారు. తాజాగా కువైట్ నుంచి వచ్చిన వారు కరోనా భారీన పడటంతో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రాష్ట్రంలో నిన్న నమోదైన కేసులతో కరోనా బాధితుల సంఖ్య 1813కు చేరింది. రాష్ట్రంలో గత మూడు రోజుల్లో 9 మంది కరోనా భారీన పడి మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1068 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా 696 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేసులు నమోదైన ప్రాంతాల్లో అధికారులు లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. కొత్త కేసులు నమోదు కాకుండా తగిన చర్యలు చేపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: