జగన్ ఏడాది పాలనను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. రైతులు ఆయన పాలనపై చాలా సంతృప్తిగా ఉన్నట్టే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆయన ఏడాదిలో రైతుల కోసం దాదాపు 10 వేల 200 కోట్లు రూపాయలకు పైగా ఖర్చుచేశారు. అధికారంలోకి రాకముందు మేనిఫెస్టోలో రూ.12,500 నగదు 4 ఏళ్ల పాటు కలిపి రూ.50 వేలు ఇస్తామని చెప్పాడు జగన్. అధికారంలోకి వచ్చాక.. చెప్పినదానికంటే ముందుగా నాలుగేళ్లు చెబితే ఐదేళ్లు ఇచ్చేట్లుగా.. మాటిచ్చింది రూ.12,500 అయితే ఇచ్చిన మాటకంటే మిన్నగా రూ.13,500 ప్రతి సంవత్సరం ఇచ్చేట్టుగా.. ఐదేళ్ల పాటు రూ.67,500 రైతుల చేతులో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 

 

పంట వేసే సమయానికి ఆ రైతు విత్తనం కొనుగోలు చేసేందుకు, వ్యవసాయ ఖర్చుల కోసం రూ.7500 మే మాసంలోనే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు. . ఖరీఫ్‌ పంట కోయడం కోసం, రబీ పంట వేసేందుకు ఏరకంగానైనా రైతుకు మళ్లీ ఉపయోగపడేలా ఉండేందుకు మళ్లీ అక్టోబర్‌ మాసంలో రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం ఇంటికి చేరేవేళ సంక్రాంతి సందర్భంగా మరో రూ. 2 వేలు రైతులకు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించారు.

 

 

జూన్‌లో జగన్ అధికారం చేపట్టారు.. అప్పటికే మే మాసంలో అయిపోయింది కాబట్టి రబీ పంటకైనా ఇవ్వాలని అక్టోబర్‌లోనే రైతుభరోసా సాయం అందించారు. దాదాపు 46.69 లక్షల రైతు కుటుంబాలకు 2019–20 సంవత్సరంలో రైతు భరోసా కింద రూ.13500 రైతులకు ఇచ్చాంరు. రూ.6,534 కోట్లను రైతు అకౌంట్లలో జమ చేశారు. 2020–21లో మే మాసంలోనే రైతులకు తోడుగా ఉండేందుకు రైతులకు మొదటి దఫా కింద రూ.7,500 జమ చేశారు.

 

 

దాదాపు మరో రూ.3,670 రైతుల ఖాతాల్లో జమ చేశారు. అంటే.. సంవత్సరం కూడా పూర్తికాక ముందే రైతులకు జగన్ సర్కారు ఇచ్చింది అక్షరాలా రూ.10,209 కోట్లు. అంతే కాదు.. రైతుల పాత అప్పులకు సంబంధం లేకుండా పెట్టుబడి సాయంగా అందేలా బ్యాంకర్స్‌తో మాట్లాడి రైతులకు ఈ సొమ్ము ఇచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: