ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ రాజకీయం ఏ విధంగా చేసినా సరే ఇప్పుడు మాత్రం జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ జనాల్లోకి వెళ్ళడం చాలా కష్టంగా మారింది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఎందుకంటే సిఎం వైఎస్ జగన్ మాటలతో పాటుగా ఆయన చేస్తున్న రాజకీయం కూడా ఆ పార్టీకి చాలా ఇబ్బంది గా మారింది. ఎక్క‌డిక‌క్క‌డ తెలుగు దేశం పార్టీకి చెక్ పెట్టుకుంటూ జ‌గ‌న్ ముందుకు వెళుతున్నాడు.

 

నిన్న మొన్న‌టి వ‌ర‌కు టీడీపీ మూల‌స్తంభాల‌ను కొట్టే ప‌నిలో బిజీ అయిన జ‌గ‌న్ ఇక ఇప్పుడు ఆ పార్టీకి క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదా లేకుండా చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం కాగా... ఇప్పుడు మ‌రో న‌లుగురై దుగురు ఎమ్మెల్యేలు సైతం అదే బాట‌లో ఉన్న‌ట్టు వార్తలు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. జగన్ ని చంద్రబాబు అంచనా వేయడం చాలా కష్టంగా మారింది అనేది రాజకీయ పరిశీలకుల మాట. జగన్ ఏ మాట‌ చెప్పినా సరే జనాలు కచ్చితంగా నమ్ముతున్నారు. చెప్పిన ప‌ని చెప్పిన‌ట్టు చేస్తుండ‌డంతో ప్రతీ మాటకు కూడా విలువ అనేది ఉంటోంది.

 

చంద్రబాబు ఏ స్థాయిలో ప్రసంగాలు చేసినా సరే ఆయనకు మాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఒకప్పుడు మహానాడు అనగానే జనాలకు ఒక క్రేజ్ ఉండేది. కాని ఇప్పుడు అది ఎవరూ చూడటం లేదు. అవును మహానాడు వస్తున్న సమయంలో మధ్యాహ్నం సమయంలో జగన్ సమీక్షా సమావేశాలు టీవీ లో ఎక్కువగా వస్తున్నాయి. వాటిని జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఆయన తమ కోసం ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది జనాలు ఆసక్తిగా చూడటం మొదలుపెట్టారు. రెండు రోజుల మహానాడు కార్యక్రమం కొన్ని చానల్స్ లో వస్తున్నా అటు సోషల్ మీడియాలో వస్తున్నా సరే ఎవరూ కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: