చంద్రబాబు నాయుడు పాలన మీద వైకాపా చీరాల ఇంచార్జ్ , మాజీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే కరోనా గనక బాబు హయాం లో వచ్చి ఉంటే ఏ అధికారి నీ ..  పనిచేయనీయకుండా రూములో కూర్చోబెట్టి సోది చెప్పి హింసించేవాడు ..అన్నారు ఆయన .. చంద్రబాబు నాయుడు సమయంలో కరోనా వచ్చి ఉంటే ఆయన అధికారుల్ని పని చేయనీకుండా రూములో కూర్చోబెట్టి గంటలు గంటలు  సోది చెప్పి హింసించేవాడని తద్వారా వేల లక్షల మంది ప్రజల మరణాలకు కారణం అయి  ఉండేవాడని చీరాల  మాజీ ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇంచార్జీ ఆమంచి కృష్ణమోహన్ ఎద్దేవా చేశారు ..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా చీరాల్లో జరిగిన కార్యక్రమంలో ఆమంచి మాట్లాడారు.

 

ఈ యేడాది పాల‌న‌లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాను మెనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నూటికి నూరు శాతం అమ‌లు చేయ‌డంతో పాటు చెప్ప‌ని హామీలు కూడా మ‌రో 40 వ‌ర‌కు అమ‌లు చేశార‌ని ఆయ‌న చెప్పారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కేరళ తర్వాత రెండో స్థానంలో నిలిచిందని దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థతే కారణమని అన్నారు. అయితే కేరళ రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యతతో పాటు వైద్యపరంగా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని ,ఆ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో వనరులు తక్కువగా ఉన్నప్పటికీ  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తెలివి, కృషి ,ముందుచూపు, సమర్థతతో కరోనాను కట్టడి చేసి వేల మంది ప్రజల ప్రాణాలు కాపాడాడని అన్నారు.

 

గత సంవత్సర కాలంగా ఏ ప్రజా సమస్యపైనా కనీసం స్పందించే అవకాశం కూడా చంద్రబాబుకు ఇవ్వకుండా ప్రజల ఇంటి ముంగిటికే పథకాలు అందించడం ద్వారా జగన్ విప్లవాత్మక  పరిపాలన సాగించారని చివరికి కరోనా సాకుతో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నుంచి పారిపోయి హైదరాబాద్ లో తలదాచుకున్నాడని ఆమంచి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: