తెలంగాణ.. ఈ రాష్ట్రానికి ఓ చరిత్ర ఉంది. ఆ చరిత్ర సృష్టించిన రోజే ఈరోజు. ఈరోజును తెలంగాణ ప్రజలెవరూ మరిచిపోలేరు. 60 ఏళ్ళ పోరాటానికి.. ఎన్నో ఉద్యమాలు.. ఎందరో అమర విరులా ప్రాణత్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన రోజు ఇది. 1969 నుంచే తెలంగాణ కోసం ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి.. కానీ తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడడానికి ఏకంగా 60 ఏళ్ళు పట్టింది. ఇంకా తెలంగాణకు రాజకీయం బలంగా మరీనాది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం. నీళ్లు, నిధులు,నియామకాలు అంటూ పోరాడి సాధించుకున్న పార్టీ తెలంగాణ.. అలాంటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి ఆరేళ్ళు పూర్తయ్యాయి. మరి ఈ ఆరేళ్లలో తెలంగాణ ఎన్ని విజయాలు సాధించింది అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

విద్యుల్లతల తెలంగాణ.. 

 

ఎందరో అన్నారు.. తెలంగాణ వస్తే చీకట్లు తప్పవు అని.. కానీ వాళ్ళ అందరూ నోర్లు మూపిస్తూ విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిచారు. 

 

మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ..

 

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో చెరువులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. దీంతో తెలంగాణ ప్రజలు నీళ్లు లేక ఇబ్బందులు పాలయ్యారు. అలా ఇబ్బంది పడిన తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట చెరువులను పునరుద్ధరణ చేసింది. ఎన్నో వేలా చెరువులకు ప్రాణం పోసింది. దింతో చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. ఇంకా మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీరు అందిస్తున్నారు. 

 

కల్యాణలక్ష్మి..

 

టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావడానికి కారణం అదే. కేసీఆర్ పరిచయం చేసిన కళ్యాణ లక్ష్మీ పథకం కారణంగానే ఎంతోమంది బాగుపడ్డారు. పేదింటి ఆడ పిల్లలకు పెళ్లికి డబ్బులు ఇవ్వడానికి రూపొందించిన పథకమే ఈ కళ్యాణ లక్ష్మీ/ షాదీ ముబారక్ పథకం. 

 

రైతు బంధు.. 

 

ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతులకు ఎకరానికి రూ.5 వేలు చొప్పున ప్రతి ఏటా రెండు విడతల్లో పది వేల రూపాయలు నేరుగా రైతుల బ్యాంకుల్లో పడుతాయి. 

 

 హాస్పిటళ్లలో మెరుగుపడ్డ మౌలిక వసతులు

 

తెలంగాణ ఏర్పాటయ్యాక హాస్పిటళ్లలో మౌలిక వసతులు మెరుగుపడ్డయి. ఇందువల్ల ఎక్కువ శాతం పేద ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రికి కాకుండా గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్తున్నారు. ఇంకా ప్రసవాల సైతం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కేసీఆర్ కిట్ పేరిట రూ.2150తో ఓ కిట్ అలాగే ఆడ పిల్ల పుడితే రూ. 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ. 12 వేలు అందజేస్తున్నారు.

 

వృద్ధులకు ''ఆసరా''.. 

 

పేద వృద్దులకు ఆసరా ఫించన్లు నిజంగా వారికీ ఆసరానిస్తున్నాయి. 200 రూపాయిల పెన్షన్ ని 2016 రూపాయలకు పెంచారు. బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు అందుతున్నాయి. 

 

జలసిరుల తెలంగాణ

 

నీళ్ల విషయంలో కష్టం ఉండకుండా.. అలాంటి పరిస్థితి లేకుండా గోదావరి, కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకునేందుకు కేసీఆర్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్రను ఒప్పించి గోదావరి నదిపై భారీ ఎత్తున కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. ఇంకా ఇలా ఎన్నో ప్రయత్నాలు చేసి నీళ్ల సమస్య లేకుండా చేస్తుంది.

 

ఐటీ రంగం అద్భుతమైన అభివృద్ధి..

 

హైదరాబాద్ ఐటీ వేగంగా అభివృద్ధి అవుతుంది. ఐటీ నగరం అయినా బెంగళూరుకు పోటీనిస్తుంది భాగ్యనగరం ఐటీ. ఐటీ రంగం ద్వారా తెలంగాణలో 5.80 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 

 

తెలంగాణ ఆవిర్భావం అయినా ఆరేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అభివృద్ధి చేశారు.. రాష్ట్రాన్ని మరెంతో అభివృద్ధి చేసే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: