కరోనా అనే భయంకరమైన వైరస్ ఎలా వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో అందరికి తెలిసిన విషయమే.. ఈ వైరస్‌కు పుట్టిల్లు అయిన చైనా త్వరగానే కోలుకుంటున్నప్పటికి, మిగతా దేశాల్లో కరోనా విజృంభన ఊహించని స్దాయిలో జరుగుతుంది.. ఇప్పటికే ఈ వైరస్‌కు వ్యాక్సిన్ చైనా దగ్గర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. అందువల్లే చైనాలో ఈ వ్యాధి నియంత్రణలో ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలో ఈ కరోనా విషయంలో అమెరికా-చైనా మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉంది. కాగా తాజాగా పాశ్చాత్య దేశాలు చేస్తున్న వ్యాక్సిన్‌ అభివృద్ధిని అడ్డుకోవడం లేదా నెమ్మది పరిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా రిపబ్లికన్‌ సెనెటర్‌ రిక్‌ స్కాట్‌ ఆరోపించారు.

 

 

అంతే కాకుండా తమ దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రిక్‌ స్కాట్‌ వెల్లడించారు. అయితే మీ దగ్గర ఎలాంటి రుజువులు ఉన్నాయని అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడానికి నిరాకరించి, ఇది మేధావి వర్గం నుంచి తెలిసిందని మాత్రం వెల్లడించారు. ఇకపోతే ఈ వైరస్ పుట్టింది చైనాలో అయినా, దీనివల్ల అమెరికా చాల నష్టపోయింది.. అంతే కాదు మొదటి నుండి ట్రంప్ కరోనా విషయంలో చైనా పై మాటల యుద్ధం చేస్తూనే ఉన్నారు.. ప్రపంచ దేశాలకు సమస్యలు సృష్టిస్తున్న చైనా విషయంలో తాము కరెక్టుగానే ఉన్నామని, అందువల్లే అమెరికాతో చైనా సత్సంబంధాలను కోరుకోవడం లేదు దీనిలో భాగంగానే అమెరికన్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలకు విరోధిగా ఉండాలని చైనా నిర్ణయించుకుందని రిక్‌ స్కాట్‌ ఆరోపించారు.

 

 

ఒక వేళ అమెరికా గనుక ఈ వ్యాక్సిన్ ముందు తయారు చేస్తే, లేదా ఇంగ్లాండ్‌ అభివృద్ధి చేసినా మేము అందరితో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ, చైనా మాత్రం అందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు.. ఏది ఏమైనా అధికార దాహంతో జరుగుతున్న ఈ యుద్ధంలో ఇంకా ఎందరి ప్రాణాలు కరోనాకు బలి అవ్వాలో, ఎన్ని కష్టాలు పడాలో తెలియక సామాన్యులు భయపడుతు బ్రతుకుతున్నారట.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: