గత కొంతకాలంగా సినీ పరిశ్రమలో చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ అన్నట్లుగా హాట్ హాట్ ఫైట్ నడుస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్‌లో సడలింపులు రావడంతో షూటింగులు మొదలుపెట్టడానికి చిరంజీవితో పాటు మరికొందరు సినీ పెద్దలు తెలంగాణ ప్రభుత్వంతో మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి బాలయ్య ఆహ్వానం అందలేదని చెప్పి, చిరంజీవి అండ్ బ్యాచ్‌పై విమర్శలు చేసి, భూములు పంచుకోవడానికే సమావేశాలు పెడుతున్నట్లు ఆరోపణలు చేశారు.

 

ఇక దీనికి కౌంటర్‌గా చిరంజీవి తమ్ముడు నాగబాబు బయటకొచ్చి, బాలయ్య కేవలం ఒక హీరో మాత్రమేనని, భూములు పంచుకున్నారని ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే ఇక్కడ నుంచి బాలయ్య వర్సెస్ చిరంజీవి అయిపోయింది. ఇద్దరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఒక హీరోపై మరో హీరో అభిమానులు విమర్శలు చేస్తున్నారు.

 

ఈ క్రమంలోనే బాలయ్య అభిమానులు చిరంజీవిని విమర్శిస్తూ...తమ హీరో మాదిరిగా చిరు మళ్ళీ ఎమ్మెల్యే అవుతారని ప్రశ్నిస్తున్నారు. బాలయ్య సినిమాలు చేస్తూనే, ఎమ్మెల్యేగా రాణిస్తూ...బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడిపిస్తున్నారని, ఇలా చిరుకు సాధ్యం కాదని అంటున్నారు. అయితే బాలయ్య అభిమానులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా సరే...చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి రావడం చాలా కష్టం.

 

ఎలాగో ప్రజారాజ్యంతో తనకు రాజకీయాలు సెట్ కావని చిరు ఫిక్స్ అయ్యి, సినిమాల్లోకి వెళ్ళిపోయారు. అలాంటిది మళ్ళీ ఆయన రాజకీయాల్లోకి రావడం చాలా కష్టం. కానీ ఆయన 2009లో తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. కాకపోతే పాలకొల్లులో ఓడిపోయారు. తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు.

 

కానీ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరమైపోయారు. భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయడం కష్టం. కానీ రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీతో సఖ్యతగా ఉంటున్నారు కాబట్టి...భవిష్యత్‌లో రాజ్యసభ దక్కిన ఆశ్చర్యపోనక్కర్లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: