ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు  ఎక్కువైపోతున్నాయి. తనను ప్రేమించడం లేదని యువతులపై ఆసిడ్ దాడి చేయడాలు... హత్యలు చేయటాలు  లాంటి  ఘటనలు  ఎక్కువైపోతున్నాయి. ఇలా ప్రేమ పేరుతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతో మంది జీవితాలు జైలుపాలు అవుతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. రోజురోజుకు ప్రేమ పేరుతో జరుగుతున్న హత్యలు పెరిగిపోతున్నాయి . ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. యువతి ప్రేమించటం లేదని  యువకుడు  దారుణానికి పాల్పడ్డాడు..


 వరంగల్ జిల్లాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా కేంద్రంలోని అబ్బనికుంట  లో 11వ డివిజన్ క్రిస్టియన్ కాలనీకి చెందిన  నిఖిల్ పదవ డివిజన్ కి  చెందిన బాలికను ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. తను ప్రేమించాలి అంటూ వెంట పడుతున్నారు. సదరు మైనర్ బాలిక మాత్రం  నిఖిల్ కు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో సదరు మైనర్ బాలిక తనను ప్రేమించడం లేదని కోపం తో ఊగిపోయాడు నిఖిల్. ఈ నేపథ్యంలోనే బుధవారం సాయంత్రం సదరు మైనర్ బాలిక ఇంటి కి వెళ్ళాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బీరు సీసా పగల గొట్టి బాలికపై విచక్షణ  రహితంగా దాడి చేశారు. 

 

 వెంటనే అప్రమత్తమైన సదరు మైనర్ బాలిక ఆ యువకుడు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో  గట్టిగా అరవడం తో స్థానికులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. నిఖిల్ పరారవ్వటంతో  బాలికను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ సదరు బాలిక కు వైద్యం చేసిన డాక్టర్లు ప్రాణాపాయం ఏమీ లేదని చెప్పడంతో తల్లిదండ్రులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక బాధితురాలు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: