సాధారణంగా తేనె అంటే అందరికి ఇష్టం ఉంటుంది. కానీ తేనెటీగలను చూస్తే మాత్రం చాలా దూరంగా ఉంటారు. కానీ కేరళ రాష్ట్రానికి చెందిన ఒక యువకుడు మాత్రం తేనెటీగలు నా స్నేహితులు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా తేనెటీగలను రక్షించడం నా కర్తవ్యం అంటూ తెలియజేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే... కేరళ రాష్ట్రానికి చెందిన సంజయ్ కుమార్ అనే ఒక యువకుడు తేనెటీగల పెంపకందారుడు. అంతేకాకుండా తేనెను తయారు చేస్తూ అమ్ముకొని తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. నేచర్  ఏంఎస్ గా పిలవబడే ఇరవై నాలుగు సంవత్సరాలైనా అతను తన చిన్నతనం నుంచే తేనేటీగల పెంపకాన్ని చేస్తూ.. వాటిని బాగా మచ్చిక చేసుకున్నాడు. నిజానికి తేనెటీగలు కుట్టడం ప్రమాదకరం అని తెలిసినా కూడా వాటితో ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు సంజయ్.

 

 

చిన్నతనం వయసులోనే...

 

తన ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచే వందలాది తేనెటీగలను తన ముఖం మీద చేతుల మీద ఉంచుకొని తన స్నేహితులను ఆశ్చర్యానికి గురి చేసేవాడు. తర్వాత కాలంలో కూడా దాదాపు నాలుగు గంటల పాటు 60 వేల తేనెటీగలను తన ముఖంపై ఉంచుకునే గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వాస్తవానికి ఇలాంటి చర్యలకు అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకం దారుల భయపడతారు. కానీ, ఈ యువకుడు మాత్రం కనురెప్పలు, పెదాల మీద తేనెటీగలను ఉంచుకొని వాటితో స్నేహితుడులాగా, సోదరిడి లాగా మెలగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 


ఈ విషయంపై సంజయ్ ని వివరణ కోరగా... మొదట్లో ఇది అంత సులభం కాదు. కానీ కొన్ని రోజుల తర్వాత నేను అలవాటు పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే నేను ఎప్పుడూ దీన్ని ఇబ్బందికరంగా అనుకోలేదని చెప్పాడు. ఇక తేనెటీగలను ముఖం మీద ఉంచుకొన్నప్పుడు కూడా నేను చూడగలిగాను, నడిచాను.. అంతేకాకుండా డాన్స్ కూడా చేశాను అంటూ సంజయ్ తెలియజేశాడు. నిజానికి తేనెటీగలతో నాకు ఒక ప్రత్యేక  బంధం ఏర్పడిందని తెలిపారు. ఆ బంధమే ఇప్పుడు ఏపీ కల్చర్ లో బెంగళూర్ లో మాస్టర్ డిగ్రీ చదవడానికి ప్రేరేపించింది అని సంజయ్ తెలిపాడు. ఇక అతి త్వరలోనే  " తేనెటీగలు గురించి అధ్యయనం చేసి డాక్టరేట్ కూడా సంపాదించాలని కలలు కంటున్నా"  అని సంజయ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: