భారత్ లో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో సెప్టెంబరు నాటికి 20 కోట్ల కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు, ప్రముఖ సాంక్రామిక వ్యాధుల నిపుణుడు డాక్టర్‌ జయప్రకాశ్‌ మలీల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాతో పోల్చి చూస్తే కేసుల సంఖ్య తక్కువే అయినా అన్ని కేసులను తట్టుకునే సామర్థ్యం భారత్ కు లేదని అన్నారు. 

 

IHG


 
అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ కరోనాతో బాగా దెబ్బ తిన్నాయని భారత్ లో వైరస్‌ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని అన్నారు. ప్రజలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవటం లేదని అందువల్ల పట్టణాల్లో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. కొద్ది వారాలుగా వైరస్ పల్లెలకు వ్యాప్తి చెందిందని చెప్పారు. సెప్టెంబరు నాటికి భారత్‌లో 20 కోట్ల కేసులు వస్తాయని తాను అంచనా వేస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
చికిత్స, ఆక్సిజన్‌ సదుపాయాలు అందించే ఏర్పాట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటే మంచిదని సూచనలు చేశారు. భారత్ లో యువత ఎక్కువగా ఉండటం వల్లే మరణాల సంఖ్య తక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌కు దేశంలో మంచి స్పందన రాలేదని.... లాక్ డౌన్ వల్ల మనకు కలిగిన లాభం కన్నా నష్టం ఎక్కువనేది తన అభిప్రాయమని చెప్పారు. లాక్‌డౌన్‌ గురించి ప్రజలకు ముందే హెచ్చరించి ఉంటే బాగుండేదని అన్నారు. 
 
వైరస్‌ ఎలాంటి లక్షణాలు లేని వారి ద్వారా వ్యాప్తి చెందుతుందని.... అలాంటి వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కాదని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారిని క్వారంటైన్‌ చేయటం వల్ల ప్రయోజనం ఉండదని.... తక్కువ జనాభా ఉన్న దేశాల్లోనే లాక్ డౌన్ తో కరోనాను కట్టడి చేయడం సాధ్యమవుతుందని చెప్పారు. పరీక్షలే కాకుండా మనం ఇతర వ్యూహాలను కూడా ఆలోచించాలని.... మనం చేసే పరీక్షలు ఎంతమందికి కరోనా సోకిందనే విషయం తెలియజేయడంతో పాటు ఎంతమందికి వైద్యం అవసరం ఉందనే విషయాన్ని తెలియజేసేలా ఉండాలని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: